Akhanda 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన అఖండ 2.. ఎక్కడ చూడొచ్చంటే..
నందమూరి బాలకృష్ణ ఇటీవల నటించిన సూపర్ హిట్ మూవీ అఖండ 2 తాండవం. సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో వచ్చిన ఈ డివైన్ యాక్షన్ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ్చచింది. ఇందులో రుద్ర సికిందర్ అఘోరాగా, బాల మురళీ కృష్ణగా బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన లేటేస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండ 2 తాండవం. భారీ అంచనాల మధ్య గతేడాది డిసెంబర్ 12న విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇందులో బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి మాస్ డైరెక్షన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్ అఖండ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి వచ్చేసింది. జనవరి 9 అర్ధరాత్రి నుంచి ఈ మూవీ ఓటీటీ మూవీ లవర్స్ ముందుకు వచ్చింది. ఇంతకీ ఈ సినిమాను ఎక్కడ చూడాలి అనేది తెలుసుకుందామా.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
అఖండ 2: తాండవం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేటర్లలో బాలయ్య సందడి ముగిసిన తర్వాత ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండగ సందర్భంగా ఓటీటీ వేదికపై మరోసారి ప్రేక్షఖులను అలరించేందుకు వచ్చేసింది అఖండ. నెట్ ఫ్లిక్స్ లో తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ఈ మూవీ విడుదలైంది. ఎప్పటిలాగే ఇటు ఓటీటీలోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ కనిమిస్తుంది. థియేటర్లలో మిస్ అయిన అడియన్స్ ఇప్పుడు నేరుగా ఇంట్లోనే చూడొచ్చు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
అఖండ 2: తాండవం చిత్రంలో సంయుక్త మీనన్, హార్షాలీ మల్హోత్రా కీలకపాత్రలు పోషించారు. ఇక ఆది పినిశెట్టి తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. ఇందులో బాలయ్య అఘోరా గెటప్, యాక్షన్ సీన్స్, తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ అయ్యాయి. ఇప్పుడు ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
Drop what you’re doing. Akhanda 2 is ready with a Lion’s thaandavam 🔥🔥 pic.twitter.com/6aWN0U5VIF
— Netflix India South (@Netflix_INSouth) January 9, 2026
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..




