Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
సినీరంగంలో ఒకప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ఫేమస్ అయ్యాడు నటుడు బాలాజీ. అప్పట్లో విలన్ పాత్రలకు అతడు కేరాఫ్ అడ్రస్. యంగ్ విలన్ గా తెరపై తన నటనతో ఆకట్టుకున్నారు. అంతేకాదు.. నటి రోహిణికి అతడు సొంత అన్నయ్య. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటుడు బాలాజీ తన చెల్లెలు రోహిణి, బావ రఘువరన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

సినిమాల్లో విలన్ అంటే రఫ్ గా ఉండాలనే నియమాన్ని మార్చిన నటుడు రఘువరన్. స్టైలీష్ విలన్ గా అద్భుతమైన నటనతో సినీరంగంలో తనదైన ముద్ర వేశారు. ఎన్నో హిట్ చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. తాజాగా రఘువరన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు బాలాజీ. అంతేకాదు.. రఘువరన్ కుమారుడి గురించి.. నటి రోహిణి తనకు సొంత చెల్లి అనే విషయాన్ని బయటపెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలాజీ మాట్లాడుతూ.. రఘువరన్ కుమారుడు ప్రస్తుతం యుఎస్‌లో మెడిసిన్ చదువుతున్నారని, తన తండ్రిలాగే ఎత్తుగా ఉంటాడని బాలాజీ వెల్లడించారు. రఘువరన్ తన కొడుకుని ఎంతగానో ప్రేమించేవారని, తన మరణానికి కొడుకు దూరం కావడం వల్ల వచ్చిన తీవ్రమైన డిప్రెషన్ ఒక ప్రధాన కారణమని అన్నారు.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
రఘువరన్ అద్భుతమైన వ్యక్తి అని, ఇతరులను అమితంగా ప్రేమించేవారని, తన దగ్గర ఉన్నదంతా పంచుకునే దాతృత్వ గుణం కలవారని బాలాజీ గుర్తు చేసుకున్నారు. రజినీకాంత్‌తో కలిసి నటించిన రోజులను బాలాజీ ప్రస్తావించారు. రఘువరన్‌తో తన బంధం చాలా బలంగా ఉండేదని, ఒకరికొకరు మాట్లాడుకునేవారని తెలిపారు. రోహిణితో విడాకుల తర్వాత వారి మధ్య దూరం వచ్చినా, రోహిణి కూడా కొంత ఆలోచించి ఉంటే రఘువరన్ బతికి ఉండేవారేమో అని తెలిపారు. డ్రగ్స్ వాడకం ఆయన మరణానికి ఒక కారణమని అందరూ చెప్పినా, తాను ప్రత్యక్షంగా చూడలేదని అన్నారు. రఘువరన్ చాలా జాలీగా, సహాయపడే స్వభావం కలవారని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రోహిణి అండగా నిలిచిందని బాలాజీ చెప్పారు.
ఇవి కూడా చదవండి : Actress Rekha: చాలా నరకం అనుభవించాను.. ఎవరూ పట్టించుకోలేదు.. ఆనందం హీరోయిన్ రేఖ..
రఘువరన్ కుమారుడు ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్‌లో మెడిసిన్ చదువుతున్నారని, తన తండ్రి రఘువరన్ లాగే ఎత్తుగా ఉంటాడని అన్నారు. రఘువరన్ తన కొడుకును విపరీతంగా ప్రేమించేవారని, “నా రక్తం నా దగ్గర లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి” అని ఆయన భావించేవారని బాలాజీ తెలిపారు. కొడుకు దూరం కావడం వల్ల వచ్చిన తీవ్రమైన డిప్రెషన్ ఆయన మరణానికి ఒక ప్రధాన కారణమని తెలిపారు. రఘువరన్, రోహిణిల వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ, నాలుగు గోడల మధ్య ఏం జరిగిందో బయటి వారికి తెలియదని బాలాజీ అన్నారు. కానీ విడాకుల విషయంలో రోహిణి కూడా ఆ ఒక్క విషయంలో కొంచెం ఆలోచించి ఉంటే రఘువరన్ ఈ రోజు బతికి ఉండేవాడని బాలాజీ అన్నారు..
ఇవి కూడా చదవండి : Tollywood : అక్క తోపు హీరోయిన్.. బావ టాప్ క్రికెటర్.. అయినా అదృష్టం కలిసి రానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ..
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
