Ayalaan : రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తమిళ బ్లాక్ బస్టర్ హిట్.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..
సాధారణంగా థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్స్, అలాగే డిజాస్టర్స్ ఏ మూవీ అయినా కేవలం 45 రోజుల్లోనే ఓటీటీ మూవీ లవర్స్ ను అలరిస్తున్నాయి. కానీ ఓ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మాత్రం దాదాపు రెండేళ్లకు ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా పేరు నెట్టింట మారుమోగుతుంది. ఇంతకీ ఏ సినిమా తెలుసా.. ?

యాంకర్ నుంచి హీరోగా మారి సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు హీరో శివకార్తికేయన్. తమిళ చిత్రపరిశ్రమలో విభిన్న కంటెంట్ చిత్రాలతో హిట్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. ఆయన నటించిన చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ హీరోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు సంక్రాంతి పండగ సందర్భంగా పరాశక్తి సినిమాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇదెలా ఉంటే.. గత రెండేళ్ల క్రితం సంక్రాంతికి హిట్టు అందుకున్నారు శివకార్తికేయన్. 2024లో పొంగల్ ఫెస్టివల్ సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకున్న సినిమా అయలాన్. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పటికీ తెలుగు ఓటీటీలోకి రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ఇవి కూడా చదవండి : Tollywood : అక్క తోపు హీరోయిన్.. బావ టాప్ క్రికెటర్.. అయినా అదృష్టం కలిసి రానీ టాలీవుడ్ ముద్దుగుమ్మ..
ప్రముఖ ఓటీటీ ప్లా్ట్ ఫామ్ ఆహా వీడియో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. జనవరి 7 నుంచి ఈ సినిమా ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. “విధిని భవిష్యత్తు కలవబోతుంది. అయలాన్ జనవరి 7 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది ఆహా. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటించగా.. ఏలియన్ పాత్రకు హీరో సిద్ధార్థ్ వాయిస్ అందించారు. అలాగే శివకార్తికేయన్, సిద్ధార్థ్ ఇద్దరూ కూడా ఈ సినిమాకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమా నిజానికి ఎనిమిదేళ్ల కిందట రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో షూటింగ్ ఆగిపోవడం.. ఆ తర్వాత అన్ని అడ్డంకులను దాటుకుని 2024లో సంక్రాంతి పండక్కి రిలీజ్ అయ్యింది. ఇప్పుడు రెండేళ్లకు తెలుగు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 83 కోట్లు వసూలు చేసింది.
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
ఇవి కూడా చదవండి : Actress Rekha: చాలా నరకం అనుభవించాను.. ఎవరూ పట్టించుకోలేదు.. ఆనందం హీరోయిన్ రేఖ..
