AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: బతికుండగానే కళ్లు పీకేసి.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. గుండె ధైర్యముంటేనే చూడండి

మీకు హారర్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమా? అయితే ఈ మూవీ ఒక మంచి ఛాయిస్. ఎందుకంటే ఇలాంటి హారర్ మూవీని మీరు ఇప్పటిదాకా చూసిండరు. ఇందులోని ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ తో కల్లోనూ వెంటాడుతాయి. అందుకే హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు, అలాగే పిల్లలు కూడా ఈ మూవీకి దూరంగా ఉంటే మంచిది.

OTT Movie: బతికుండగానే కళ్లు పీకేసి.. ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. గుండె ధైర్యముంటేనే చూడండి
Eye For An Eye Movie
Basha Shek
|

Updated on: Jan 06, 2026 | 10:09 PM

Share

ఇప్పుడే ఏ భాషలోనైనా హారర్ సినిమాలే ట్రెండ్. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ ఈ జానర్ సినిమాలదే హవా. ముఖ్యంగా ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ప్రతి వారం ఏదో ఒక హారర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తూనే ఉంది. అలా ఇప్పుడు ఓ హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ను బాగా భయపెడుతోంది. ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ తో వణికిస్తోంది. ఒక ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై ఆడియెన్స్ ను భయపెట్టింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ముఖ్యంగా ఇందులోని సీన్స్, విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.  ఇక ఇటీవలే ఈ హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అన్నా రీవ్స్ (విట్నీ పీక్) అనే అమ్మాయి చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది.  ఆమె తల్లిదండ్రులు ఒక కార్ యాక్సిడెంట్‌ లో చనిపోతారు. అదే బాధతో చిన్నప్పటి నుంచి తాను ఎప్పుడూ చూడని అమ్మమ్మ (ఎస్. ఎపాథా మెర్కర్సన్) దగ్గరకు వెళ్తుంది. అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటుంది. ఈ క్రమంలో అదే ఊరిలో ఉన్న అన్నా లోకల్ టీన్స్ (ఫిన్ బెన్నెట్, లేకెన్ గిల్స్)తో స్నేహం చేస్తుంది. అయితే వాళ్లు చేసే ఓ భయంకరమైన పనికి ఈ అమ్మాయి సాక్షి అవుతుంది. స

అప్పటి నుంచి ఆమెను  మిస్టర్ సాండ్‌మ్యాన్ అనే ఓ మిస్టీరియస్ ప్రాణి వెంటాడడం మొదలు పెడుతుంది. మిస్టర్ సాండ్‌ మ్యాన్  బతికుండాగానే వాళ్ల కళ్లు పీకేసి, అమాంతం తినేస్తాడు. ఈ  విషయం తెలుసుకున్న అన్నా తన తప్పుని సరిదిద్దుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. లేదంటే ఆమెను కూడా ఆ వింత ప్రాణి తినేస్తుంది. మరి ఇంతకీ అన్నా చేసిన తప్పు ఏంటి ? మిస్టర్ సాండ్‌ మ్యాన్   ఎందుకు అలా కళ్లు పీకేసి తింటోంది ? క్లైమాక్స్ ఏంటి ? అన్నప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ హారర్ థ్రిల్లర్ సినిమా చూడాల్సిందే.

2025లో విడుదలైన ఈ హారర్ మూవీ ‘ఐ ఫర్ అన్ ఐ’ (Eye for an Eye). కోలిన్ టిల్లీ తెరకెక్కించిన ఈ సినిమాలో అన్నా రీవ్స్ పాత్రలో విట్నీ పీక్ నటించగా, ఎస్. ఎపాథా మెర్కర్సన్ గ్రాండ్‌మదర్ మే రోల్ పోషించింది. ప్రస్తుతం ఈ సినిమా ఆపిల్ టీవీ ప్లస్ ( Apple TV+)లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..