Akhanda 2 OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి బాలయ్య ‘అఖండ 2’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్. అఖండ 2 తాండవం ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. నిన్నటివరకు బాలయ్య సినిమా ఓటీటీ రిలీజ్ పై పలు అనుమానాలు వ్యక్తమవయ్యాయి. అయితే వాటన్నిటికీ తెరపడేలా నెట్ ఫ్లిక్స్ కీలక ప్రకటన విడుదల చేసింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘అఖండ 2: తాండవం’. బోయపాటి శీను తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 12న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 120 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. థియేటర్లలో ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్న అఖండ 2 ను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే బాలయ్య సినిమా ఓటీటీ విషయమై గత రెండు రోజులుగా పలు అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. సంక్రాంతి కానుకగా జనవరి 09 నుంచి అఖండ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు నెట్ ఫ్లిక్స్ యాప్‌లో పేర్కొంది. అప్‌కమింగ్ చిత్రాల లిస్ట్ లో కూడా ఈ సినిమాను చేర్చింది. అయితే అనూహ్యంగా నెట్‌ఫ్లిక్స్ క్యాటలాగ్‌లో అఖండ 2 మాయమైంది. దీంతో తెర వెనక ఏం జరుగుతుందో అర్థం కాక అభిమానులు తలలు పట్టుకున్నారు. అఖండ 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ క్యాన్సిల్ అయ్యిందని ప్రచారం జరగడంతో బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఈ రూమర్లకు తెరదించుతూ బాలయ్య సినిమా స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వెలువడింది .
ఇంతకు ముందు చెప్పినట్టుగానే జనవరి 09 నుంచే అఖండ 2 సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు నెట్ ఫ్లిక్స్ పేర్కొంది.’ బాబు రెడీ బాబు.. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్’ అంటూ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో అఖండ 2 పోస్టర్ ను షేర్ చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ బాలయ్య సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.
కాగా గతంలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవం సినిమాను తెరకెక్కించారు బోయపాటి. . తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్, ivy ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై రామ్ అచంట, గోపీ అచంట, ఇషాన్ సక్సెనా ఈ సినిమాను నిర్మించారు. సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించింది. బజరంగీ భాయిజాన్ ఛైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా బాలయ్య కూతురిగా మెప్పించింది. వీరితో పాటు అచ్యుత్ కుమార్, విజయ్ చంద్రశేఖర్, పూర్ణ, , హర్ష, జగపతి బాబు, రచ్చ రవి, అయ్యప్ప, రాన్సన్ విన్సెంట్, కబీర్ దుల్హన్ సింగ్.. ఇలా చాలా మంది నటీనటులు వివిధ పాత్రల్లో కనిపించారు.
మరో రెండు రోజుల్లో నెట్ ఫ్లిక్స్ లో బాలయ్య అఖండ 2 తాండవం..
Babu ready babu… start camera.. Action! 😎🔥 pic.twitter.com/nPjOkZ8cuG
— Netflix India South (@Netflix_INSouth) January 7, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




