AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikanth : ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. పాతిక సినిమాలు చేసినా హిట్టు కాలేదు.. శ్రీకాంత్ ..

హీరో శ్రీకాంత్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో అలరించిన హీరో. ఫ్యామిలీ ప్రేక్షకులు,లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న హీరో. ఇప్పటికీ బ్యా్క్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన శ్రీకాంత్.. ఇప్పుడు సహయ నటుడిగా రాణిస్తున్నారు. అయితే ఒక సినిమా తర్వాత తన గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని అన్నారు. పాతిక సినిమాలు చేసినా ఒక్కటి హిట్టు కాలేదని అన్నారు.

Srikanth : ఆ సినిమా తర్వాత నా గ్రాఫ్ మొత్తం పడిపోయింది.. పాతిక సినిమాలు చేసినా హిట్టు కాలేదు.. శ్రీకాంత్ ..
Srikanth
Rajitha Chanti
|

Updated on: Jan 06, 2026 | 9:24 AM

Share

హీరో శ్రీకాంత్ క్రేజ్ గురించి తెలిసిందే. ఒకప్పుడు జగపతి బాబు తర్వాత ఆ స్థాయిలో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. విభిన్న కంటెంట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికీ సినిమాల్లో సహయ నటుడిగా కనిపిస్తూ బిజీగా ఉంటున్నారు. అయితే మహాత్మ చిత్రం తర్వాత తన సినీ కెరీర్‌లో ఎదురైన పరిస్థితులను ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు శ్రీకాంత్. ఒకానొక దశలో తాజ్ మహల్, పెళ్లి సందడి, ఆహ్వానం, వినోదం వంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకుపోయానని, ఒక హిట్ వస్తే వెంటనే రెండు మూడు సినిమాలు చేతిలో ఉండేవని ఆయన గుర్తుచేసుకున్నారు. 2000 సంవత్సరంలో కూడా ఒక సినిమా హిట్ అయితే దాని తర్వాత మూడు సినిమాలు ఖచ్చితంగా ఉండేవని తెలిపారు. కానీ మహాత్మ తన 100వ చిత్రం తర్వాత కెరీర్ పెద్ద దెబ్బతిన్నదని శ్రీకాంత్ అన్నారు. ఆ తర్వాత సుమారు 25 సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ, ఏదీ విజయం సాధించలేదని అన్నారు.

ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..

మహాత్మ తర్వాత సినిమాలు సక్సెస్ కాకపోవడంతో చాలా మంది కామెంట్స్ చేశారని అన్నారు. “కొంతమంది టైం బాలేదు అంటారు, మరికొంతమంది సైన్స్ ఎండ్ అయిపోయింది, ఫిలాసఫీ ప్రారంభం అవుతుంది అంటారు” అని చెప్పుకొచ్చారు. యంగ్ హీరోస్ పరిశ్రమలోకి పెద్ద సంఖ్యలో రావడం, యువ బ్యాచ్ వస్తున్న తరుణంలో ఏ హీరో అయినా కొంతకాలం తర్వాత ఫేడ్ అవుట్ కావడం సహజమేనని అన్నారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలకు ఉన్న భయంకరమైన ఇమేజ్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా వారు సుదీర్ఘకాలం నిలబడగలరని, తమకు అంతటి ఫ్యాన్ బేస్ లేకపోవడం ఓపెనింగ్స్ విషయంలో ప్రతికూలంగా మారిందని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి :  Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‏ను గెలిచి.. ఇప్పుడు ఇలా..

గతంలో సినిమా బాగుంటే, నెమ్మదిగా పాజిటివ్ టాక్ వస్తే అది క్రమంగా ఎక్కువ కలెక్షన్లను సాధించేదని, ప్రేక్షకులు సినిమా చూడటానికి వచ్చే వారని తెలిపారు. అయితే, ప్రస్తుత ట్రెండ్ పూర్తిగా మారిందని, మొదటి రోజే సినిమాకు మంచి టాక్ రాకపోతే, నాలుగో రోజు కాదు కదా, మధ్యాహ్నానికే సినిమాను థియేటర్ల నుండి తీసేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా బాలేదని టాక్ వస్తే ఇప్పుడు ఎవరూ థియేటర్లకు రావడం లేదని పేర్కొన్నారు. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, తాను చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలని మొదటి నుండి అనుకున్నానని, ఆ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నానని అన్నారు.

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..