AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: సంక్రాంతి సీజన్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో 15కు పైగా కొత్త సినిమాలు.. బాలయ్య అఖండ 2తో పాటు..

సంక్రాంతి సీజన్ వచ్చేసింది. థియేటర్లలోకి వరుసగా పెద్ద సినిమాలు క్యూ కట్టనున్నాయి. ఈ వారంలోనే ప్రభాస్ ది రాజాసాబ్ థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఆసక్తికర సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి.

OTT Movies: సంక్రాంతి సీజన్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లో 15కు పైగా కొత్త సినిమాలు.. బాలయ్య అఖండ 2తో పాటు..
OTT Movies
Basha Shek
|

Updated on: Jan 06, 2026 | 10:23 AM

Share

ఈ వీకెండ్ నుంచే సంక్రాంతి సినిమాల హడావుడి మొదలు కానుంది. ముందుగా ప్రభాస్ ‘రాజాసాబ్’ థియేటర్లలోకి రానుండగా.. అదే రోజు దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయకుడు’ రిలీజ్ కానుంది. ఆ తర్వాత రోజు తమిళ హీరో శివకార్తికేయన్ ‘పరాశక్తి’ థియేటర్లలో సందడి చేయనుంది. ఇదే వారం ఓటీటీల్లోనూ ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బాలకృష్ణ నటించిన అఖండ 2. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఓటీటీలో ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. దీంతో పాటు దే దే ప్యార్ దే 2, వెపన్స్, మాస్క్ తదితర సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి.అలాగే సైలెంట్ క్రైమ్స్, హనీమూన్ సే హత్య లాంటి వెబ్ సిరీస్‌లు కూడా ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి ఈ వారంలో ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయో తెలుసుకుందాం రండి.

నెట్‌ఫ్లిక్స్

  • డిఫైనింగ్ డెస్టినీ (కొలంబియన్ వెబ్ సిరీస్) – జనవరి 05
  • గుడ్ నైట్ అండ్ గుడ్ లక్ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 07
  • ది రూకీ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జనవరి 08
  • హిజ్ అండ్ హర్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జనవరి 08
  • అఖండ 2 (తెలుగు సినిమా) – జనవరి 09
  • దే దే ప్యార్ దే 2 (హిందీ సినిమా) – జనవరి 09
  • ఆల్ఫా మేల్స్ సీజన్ 4 (ఇంగ్లిష్ సిరీస్) – జనవరి 09
  • పీపుల్ వుయ్ మెట్ ఆన్ వెకేషన్ (ఇంగ్లిష్ సినిమా) – జనవరి 09
  • కాట్ స్టీలింగ్ (ఇంగ్లిష్ మూవీ) – జనవరి 10
ఇవి కూడా చదవండి

జియో హాట్‌స్టార్

  • వెపన్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జనవరి 08
  • ఏ థౌజండ్ బ్లోస్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – జనవరి 09

జీ5 ఓటీటీలో

  • మాస్క్ (తమిళ మూవీ) – జనవరి 09
  • జోతో కండో కోల్‌కత్తాయి (బెంగాలీ సినిమా) – జనవరి 09
  • హనీమూన్ సే హత్య (డాక్యుమెంటరీ వెబ్ సిరీస్) – జనవరి 09

సన్ నెక్స్ట్

  • సైలెంట్ క్రైమ్స్ (తెలుగు డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ) – జనవరి 08

ఈటీవీ విన్ లో..

  • కానిస్టేబుల్‌ కనకం (వెబ్‌సిరీస్‌: సీజన్‌2)- జనవరి 8

సోనీ లివ్

  • ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్) – జనవరి 09

Note: ఇవి కాక వారం  కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.