AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆఫర్స్ నిల్.. అయినా 6 నిమిషాలకు 6 కోట్లు.. ఈ హీరోయిన్ డిమాండ్ మాములుగా లేదుగా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా మెప్పించిన తారలు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల గురించి చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు కొందరు హీరోయిన్స్ పెళ్లి చేసుకుని సెటిల్ కాగా.. మరికొందరు మాత్రం పెళ్లి మాటెత్తకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.

Tollywood : ఆఫర్స్ నిల్.. అయినా 6 నిమిషాలకు 6 కోట్లు.. ఈ హీరోయిన్ డిమాండ్ మాములుగా లేదుగా..
Tamannah
Rajitha Chanti
|

Updated on: Jan 06, 2026 | 8:18 AM

Share

తెలుగు సినిమా ప్రపంచంలో తమదైన ముద్ర వేసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తక్కువ సమయంలోనే వరుస సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న హీరోయిన్ త్రిష. ఇప్పటికీ పెళ్లి మాటెత్తకుండా వరుస సినిమాలతో అలరిస్తుంది. ఇప్పుడు ఆమె దారిలోనే మరో హీరోయిన్ సైతం రాణిస్తుంది. మెయిన్ లీడ్ రోల్ ఆఫర్స్ రాకపోయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేదే లే అంటుంది. గ్లామర్ పాటలతో రచ్చ చేస్తున్న ఈ అమ్మడు కేవలం 6 నిమిషాలకు 6 కోట్లు డిమాండ్ చేస్తుందట. ఆమె మరెవరో కాదండి..మిల్కీ బ్యూటీ తమన్నా. శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో హిట్టు అందుకుంది. ఈ మూవీ తర్వాత ఆమె కెరీర్ మారిపోయింది. తెలుగుతోపాటు తమిళంలోనూ స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుని స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..

వరుస విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. సౌత్ టూ నార్త్.. అన్ని వర్గాల ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న ఈ ముద్దుగుమ్మకు.. ఇప్పుడు మెయిన్ హీరోయిన్ లీడ్ రోల్ ఆఫర్స్ తగ్గిపోయాయి. చాలా కాలంగా ఆమె కేవలం స్పెషల్ పాటలతోనే నెట్టుకోస్తుంది. అటు హిందీలో మాత్రం ఈ అమ్మడు డిమాండ్ వేరేలెవల్ లో ఉంది. ఇటీవలి కాలంలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంది. జైలర్ సినిమాలో కావాలయ్యా పాటతో మరింత పాపులర్ అయ్యింది. కొన్ని రోజుల క్రితం హిందీలో ఆజ్ కీ రాత్ అనే పాటతో మరింత రచ్చ చేసింది.

ఇవి కూడా చదవండి :  Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‏ను గెలిచి.. ఇప్పుడు ఇలా..

ఇటీవల రైడ్ 2 సినిమాలో తమన్నా నషా పాటలో మతిపోగొట్టేసింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. అయితే ఈ పాటకు దాదాపు రూ.5 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారని టాక్. ఇక ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం తమన్నా మరోసారి తన రెమ్యునరేషన్ పెంచేసిందట. ఇటీవల గోవాలో జరిగిన ఓ ఈవెంట్ లో 6 నిమిషాల డ్యాన్స్ కోసం దాదాపు రూ.6 కోట్లు తీసుకుందట. ఇప్పుడు ఇదే న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతుంది. సినిమాలు లేకపోయినా.. తమన్నా డిమాండ్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..