OTT Movie: ‘ఐవీఎఫ్’లో ఇలాంటివి కూడా జరుగుతాయా? OTTలోకి వచ్చేసిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.3 రేటింగ్
కొన్ని రోజుల క్రితమే విడుదలైన ఈ సినిమా ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో ఉన్న చీకటి కోణాలను చూపిస్తూ తెరకెక్కించిన ఈ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ కు మంచి వసూళ్లే వచ్చాయి. ఇక ఐఎమ్ డీబీలోనూ 8.3 రేటింగ్ దక్కింది.

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జనవరి 09) ఓటీటీలోకి చాలా మంచి కంటెంటే వచ్చింది. తెలుగుతోపాటు వివిధ భాషలకు చెందిన కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అయితే ఇందులో తమిళ సినిమా కూడా ఉంది. ఇప్పటికే ఈ మూవీ ఒరిజనెల్ వెర్షన్ ఓటీటీలో ఉండగా శుక్రవారం నుంచి తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది. ఐవీఎఫ్ (IVF) మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ గతేడాది నవంబర్ లో థియేటర్లలో రిలీజైంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లోన చీకటి కోణాలను చూపిస్తూ తెరకెక్కించిన ఈ మూవీ తమిళ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే వచ్చాయి. ఇక ప్రమోషన్ల సమయంలో జరిగిన ఒక సంఘటన వల్ల ఈ సినిమా బాగానే వార్తల్లో నిలిచింది. మూవీకి మంచి పబ్లిసిటీ లభించింది. ఐఎండీబీలో ఈ మూవీకి 8.3/10 రేటింగ్ దక్కడం విశేషం.
సినిమా కథేంటంటే..
ఇటీవల కాలంలో పిల్లలు పుట్టకపోవడమనేది పెద్ద సమస్యగా మారిపోయింది.ఈ నేపథ్యంలో చాలా మంది ఐవీఎఫ్ అనే పద్ధతిలో పిల్లలకు జన్మనిచ్చి పేరెంట్స్ గా ప్రమోషన్ పొందుతున్నారు. ఇలా ఎంతో మందిని అమ్మానాన్నలుగా మారుస్తోన్న ఐవీఎఫ్ లో స్కామ్స్ ఆధారంగానే ఈ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ ను తెరకెక్కించారు. ఒక పోలీస్ ఆఫీసర్ IVF ద్వారా పుట్టిన పిల్లల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అండాల దొంగతనం, నిషేధిత రసాయనాల వాడకం వంటి డార్క్ సీక్రెట్స్ ను ఈ సినిమాలో చూపించారు. ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు అదర్స్. అబిన్ హరిహరన్ రాసి తెరకెక్కించిన ఈ సినిమాలో అదిత్య మాధవన్, గౌరీ కిషన్, అంజు కురియన్ ప్రధాన పాత్రల్లో నటించారు మునీష్‌కాంత్, హరీష్ పెరడి, ఆర్ సుందర్రాజన్, నందు జగన్, మాలా పార్వతి, వినోద్ సాగర్ తదితరులు ఇతర కీ రోల్స్‌లో కనిపించారు.
ప్రస్తుతం అదర్స్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. మంచి సస్పెన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ మూవీ చూడాలనుకునేవారికి అదర్స్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
అదర్స్ సినిమాపై నెటిజన్ రివ్యూ..
#OthersMovie Review
One Word -Decent Crime/Thriller Drama Ratings 3/5
1st half Slow but Steady 2nd half Decent, Adithya 😎Fit the Role,Gouri ,Anjugurian, Munishkanth Gud, Villain Reason not Convinced,Making Low Budget, BGM👍 Direction Engaging,
Overall -One time watchable pic.twitter.com/6dvnsLYCgI
— Thiru (@Thiru_twits19) December 30, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




