Chiranjeevi: అందుకే అన్నయ్య నువ్వంటే ఇష్టం.. ఆ చిన్నారిని ప్రత్యేకంగా కలిసిన చిరంజీవి.. కళ్లు చెమర్చే వీడియో
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మెగా మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటున్నారు చిరంజీవి.

చిరంజీవి సినిమాలు ఆడినా, ఆడకపోయినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే అభిమానుల హృదయాల్లో ఎప్పుడో చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారు మెగాస్టార్. సినిమాల సంగతి పక్కన పెడితే.. తన సామాజిక సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్నారు చిరంజీవి. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్.. ఇలా ఎంతో మందికి ప్రాణాలు కాపాడారు. చిరంజీవి. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు మెగాస్టార్. ‘జీ తెలుగు’ ఛానల్‌లో ‘సూపర్ సింగర్ లిటిల్ ఛాంప్స్’ అంటూ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సుధీర్ యాంకర్‌గా వ్యవహరిస్తుండగా, జడ్జిలుగా అనంత శ్రీరామ్, అనిల్ రావిపూడి, ఎస్పీ శైలజ వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో వరుణవి అనే చిన్నారి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. బాధాకరమైన విషయమేమిటంటే.. ఆ పాప దివ్యాంగురాలు.. పుట్టుకతోనే రెండు కళ్లు కనిపించవు. అయినా తన ముద్దు ముద్దు మాటలు, పాటలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అయితే ఇటీవల వరుణవి అనిల్ రావిపూడిని ఒక కోరిక కోరింది. తనను మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్లమని, ఆయనతో కలిపించమని అడిగింది. దీంతో అక్కడికక్కడే మెగాస్టార్ అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ ఆ చిన్నారిని మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్లారు. ఈసందర్భంగా చిరంజీవి ఆ పాపను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. వరుణవి కూడా చిరంజీవి పాటలు, డైలాగ్స్ చెప్పి మెగాస్టార్ ని మెప్పించింది. చిరంజీవి కూడా ఆ చిన్నారి ట్యాలెంట్ కు ఫిదా అయ్యారు. భవిష్యత్తులో ఆ చిన్నారికి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను అని కుటుంబ సభ్యులకు మాట ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బాగా ఎమోషనల్ అవుతున్నారు.
వీడియో ఇదిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




