Indraneel : ఉదయ్ కిరణ్ నా క్లోజ్ ఫ్రెండ్.. చనిపోతే అందుకే వెళ్లలేదు.. మొగలి రేకులు నటుడు ఇంద్రనీల్..
ఉదయ్ కిరణ్.. ఈ పేరు వినబడితే ఇప్పటికీ ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లుతాయి. హ్యాట్రిక్ హిట్టుకొట్టిన హీరో.. అనుహ్యంగా జీవితానికి ముగింపు పలికాడు. 2014 జనవరి 5న తన నివాసంలో సూసైడ్ చేసుకోవడంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. సినిమాలు వరుసగా ప్లాప్ కావడంతో మానసిక ఒత్తిడికి గురయ్యారని.. అందుకే ఆత్మహత్య చేసుకున్నారని అంటుంటారు. ఉదయ్ కిరణ్ తో తమకున్న అనుబంధం గురించి చెబుతూ ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకుంటారు పలువురు నటీనటులు. తాజాగా సీరియల్ నటుడు ఇంద్రనీల్ సైతం ఉదయ్ కిరణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

చక్రవాకం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు నటుడు ఇంద్రనీల్. ఒకప్పుడు స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మొగలి సీరియల్ తో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. కానీ అనుహ్యంగా ఈ సీరియల్ నుంచి తప్పుకున్నాడు. తర్వాత చాలా కాలంపాటు సీరియల్స్ చేయలేదు. ఇప్పుడిప్పుడే బుల్లితెరపై యాక్టివ్ అయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రనీల్ తన పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే దివంగత హీరో ఉదయ్ కిరణ్‌తో తనకున్న అనుబంధం గురించి బయటపెట్టారు. ఉదయ్ కిరణ్‌తో తన పరిచయం అనుకోకుండా వీసా ఇంటర్వ్యూ సమయంలో జరిగిందని, ఆ తర్వాత న్యూయార్క్‌లో ఒక 20 రోజులపాటు కలిసి గడపడం ద్వారా ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఏర్పడిందని ఇంద్రనీల్ వివరించారు. ఉదయ్ కిరణ్ తనను సొంత సోదరుడిలా భావించి ఎంతో ప్రేమగా చూసుకునేవాడని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
2011లో న్యూయార్క్‌లో జరిగిన ఒక స్టేజ్ షోలో ఇంద్రనీల్ డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చినప్పుడు, తన స్నేహితుడు ఇంత అద్భుతంగా డాన్స్ చేస్తాడని తనకు తెలియదని ఉదయ్ కిరణ్ మైక్ తీసుకుని మరీ వేదికపై ప్రశంసించారని, తన స్నేహితుడైనందుకు గర్వపడుతున్నానని చెప్పాడని ఇంద్రనీల్ గుర్తుచేసుకున్నారు. ఒక హీరో అయ్యి ఉండి, అంత స్టార్ విజయవంతమైన దశలో అంత ఓపెన్‌గా తన గురించి చెప్పడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన తెలిపారు. అయితే, ఉదయ్ కిరణ్ చివరి రోజుల్లో తాను ఆయన్ను నేరుగా చూడలేకపోయానని, అంత సన్నిహిత వ్యక్తిని ఆ స్థితిలో చూడటానికి తనకు ధైర్యం సరిపోలేదని.. అందుకే తనను చూడటానికి వెళ్లలేదంటూ ఇంద్రనీల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఉదయ్ కిరణ్ చాలా మంచి వ్యక్తి అని, ఆయన జ్ఞాపకాలు తనకెప్పటికీ ఉంటాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
ఇటీవల విడుదలైన శంభాల చిత్రంలో తన పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయని.. కొందరు ప్రేక్షకులు తనను భళ్లాలదేవ పాత్రతో పోల్చారని తెలిపారు. ఈ సినిమా తర్వాత మంచి సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని ఇంద్రనీల్ చెప్పారు.
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..
