AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగా డాటర్ సుస్మితకు ఇష్టమైన స్టార్ హీరో ఎవరు? బాబాయ్ పేరు కాకుండా ఆయన పేరు చెప్పడంతో ఫ్యాన్స్​ షాక్!

టాలీవుడ్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఆ వారసురాలు కేవలం కాస్ట్యూమ్ డిజైనర్‌గానే కాకుండా ఇప్పుడు సక్సెస్ ఫుల్ నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అటు వెబ్ సిరీస్‌లు, ఇటు ఓటీటీ చిత్రాలతో బిజీగా ఉంటూనే, ఇప్పుడు ఏకంగా తన తండ్రితోనే ఒక భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు.

మెగా డాటర్ సుస్మితకు ఇష్టమైన స్టార్ హీరో ఎవరు? బాబాయ్ పేరు కాకుండా ఆయన పేరు చెప్పడంతో ఫ్యాన్స్​ షాక్!
Pawan Susmitha And Chiru
Nikhil
|

Updated on: Jan 08, 2026 | 6:45 AM

Share

సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆమె పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా సాధారణంగా ఎవరైనా మెగా ఫ్యామిలీలో ఫేవరెట్ హీరో ఎవరంటే తండ్రి లేదా బాబాయ్ పేరు చెబుతారు. కానీ ఈ మెగా వారసురాలు మాత్రం ఒక ఇంటర్నేషనల్ స్టార్ పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

మెగా డాటర్ సుస్మిత కొణిదెల ఇప్పుడు తన తండ్రి హీరోగా ‘మన శంకరవరప్రసాద్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై షైన్ స్క్రీన్స్ సాహు గారపాటితో కలిసి ఆమె ఈ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా, విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాతో నిర్మాతగా తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఆమె పట్టుదలతో ఉన్నారు.

ఫేవరెట్ హీరో..

ప్రమోషన్లలో భాగంగా సుస్మితను మీకు ఇష్టమైన హీరో ఎవరని ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సొంత ఫ్యామిలీలో నాన్న, బాబాయ్ పవన్ కళ్యాణ్ అంటే ఎలాగూ ప్రాణమని చెబుతూనే.. బయట హీరోల్లో తనకు సూపర్‌స్టార్ రజనీకాంత్ అంటే చాలా ఇష్టమని వెల్లడించారు. చిన్నప్పటి నుండి రజనీ సినిమాలు చూస్తూ పెరిగామని, ఆయన మేనరిజమ్స్, స్టైల్ అంటే తనకు అమితమైన అభిమానమని సుస్మిత చెప్పారు. ఒక మెగా వారసురాలు ఇలా ఓపెన్ గా రజనీకాంత్ పేరు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

బాబాయ్ సినిమాపై క్లారిటీ..

ఈ సినిమాలో తన తండ్రి లుక్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సుస్మిత తెలిపారు. యంగ్ అండ్ స్టైలిష్‌గా కనిపించడం కోసం ప్రత్యేకంగా ఒక స్టైలిస్ట్‌ను నియమించినట్లు చెప్పారు. “నాన్న స్క్రిప్ట్ విషయంలో నా సలహాలు కూడా తీసుకుంటారు. ఇందులో నా ఇన్‌పుట్స్ కూడా కొన్ని ఉన్నాయి” అని ఆమె పేర్కొన్నారు. ఇక బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో సినిమా ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నకు స్పందిస్తూ.. “బాబాయ్‌తో సినిమా చేయాలని నాకు చాలా ఆశగా ఉంది. ఇప్పటికే ఆయనను అడిగాను. కానీ ఆయనతో సినిమా చేయడానికి చాలా మంది నిర్మాతలు క్యూలో ఉన్నారు. నేను కూడా అదే క్యూలో దేవుడి దయ కోసం ఎదురుచూస్తున్నాను” అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.

Rajinikanthh.

Rajinikanthh.

‘మన శంకరవరప్రసాద్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్‌ను పొందింది. సినిమా నిడివి కూడా చాలా డీసెంట్‌గా ఉందని, సెన్సార్ రిపోర్ట్ పాజిటివ్‌గా రావడంతో టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామని సుస్మిత వెల్లడించారు. బుధవారం ఈ సినిమాకు సంబంధించి ఒక గ్రాండ్ ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతగా సుస్మిత కొణిదెల తన తొలి బిగ్ బడ్జెట్ సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. రజనీకాంత్ పై ఆమెకున్న అభిమానం, బాబాయ్ సినిమాపై ఆమెకున్న ఆశలు నిజమవ్వాలని ఆశిద్దాం.