ఇదెక్కడి సిరీస్ రా మావ..! సీన్ సీన్‌కు భయంతో గుండె ఆగేలా ఉందిగా..
హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా మంది భయపెట్టె దెయ్యాల సినిమాలు చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎలాంటి హారర్ సినిమాలు వచ్చిన వదిలిపెట్టకుండా చూస్తుంటారు. మరికొంతమంది భయమేసిన కళ్లు మూసుకుంటునైనా సినిమాను చూస్తూ ఉంటారు. ఓటీటీలో భయపెట్టే సినిమాలు చాలానే ఉన్నాయి.

ఓటీటీ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఓటీటీల్లో కొన్నాళ్లుగా హారర్ కంటెంట్ చిత్రాలు అధికంగా స్ట్రీమింగ్ అవుతున్నాయి. దర్శకనిర్మాతలు కూడా హారర్ కంటెంట్ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీల్లో దూసుకుపోతున్నాయి. మర్డర్ మిస్టరీ, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, ఆసక్తిని రేకెతెత్తించే వెబ్ సిరీస్లు నిత్యం సినీప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలోకి వణికించే హారర్ సిరీస్ ఆకట్టుకుంటుంది. 1990ల్లో టీవీ ప్రేక్షకులను అలరించిన అనేక హారర్ షోలు మళ్లీ వరుస కడుతున్నాయి. ఇప్పుడు అలాంటిదే ‘ది జీ హారర్’ షో. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈసిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్
ఈ హారర్ సిరీస్ చాలా భయంకరంగా ఉంటుంది. ఈ సిరీస్ లో సీన్స్ ప్రేక్షకులకు దడ పుట్టిస్తాయి. అప్పట్లో ఈ సిరీస్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్ చాలా ఫెమస్.. 1993 నుంచి 2001 వరకు జీటీవీలో ది జీ హారర్ షో టెలికాస్ట్ అయ్యింది. ఈ హారర్ జానర్ షో 1990ల్లో ఎక్కువ మంది చూసిన షో ఇదే. మొత్తం 350 ఎపిసోడ్స్ ఉంటాయి. దీనిని ది రామ్సే బ్రదర్స్ తెరకెక్కించారు. ఇందులో భయానక వ్యక్తులు,నమ్మలేని నిజాలు, శాపగ్రస్తమైన ఇళ్ల గురించి ఈ షోలో చూపించారు.
13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..
ఒక్కో ఎపిసోడ్ ఒక్కో భయానక ఘటన గురించి వివరిస్తుంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత ఈ హారర్ షో ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. దస్తక్ అనే మొదటి ఎపిసోడ్‌లో పంకజ్ ధీర్, షగుఫ్తా అలీ , అర్చన పురాణ్ సింగ్ నటించారు. ఇది ఆగస్ట్ 9, 1993న ప్రసారమైంది. రోహిత్ రాయ్, దీప్శిఖా నాగ్‌పాల్ నటించిన చివరి ఎపిసోడ్ 2001లో ప్రసారమైంది. ఇక ఇప్పుడు మరోసారి ఓటీటీలో ఆకట్టుకుంటుంది ఈ హారర్ సిరీస్.
వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




