అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మల్లో దివి ఒకరు. బిగ్ బాస్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది వయ్యారి భామ దివి. బిగ్ బాస్ కంటే ముందు దివి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది .

పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో పాపులర్ అయ్యింది అందాల ముద్దుగుమ్మ దివి. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత బిగ్ బాస్ గేమ్ షోలో ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ షోలో ఈ అమ్మడు తన ఆటతో ఆకట్టుకుంది. అలాగే ఈ అమ్మడు తన అందంతోనూ ప్రేక్షకులను కవ్వించింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దివికి వరుస అవకాశాలు వస్తాయని అంతాఅనుకున్నారు కానీ అలా జరగలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాతో బిజీగా గడుపుతుంది. కాగా గతంలో దివి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది.
మహేష్, పవన్ కళ్యాణ్ అలా.. ప్రభాస్ ఇలా..! స్టార్ హీరోల గురించి ప్రభాస్ శ్రీను ఏమన్నారంటే
ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో నటి దివి తన గత ప్రేమకథ గురించి, అది బ్రేకప్ కావడానికి గల కారణాలను పంచుకుంది. బీటెక్, ఎంటెక్ చదువుకునే రోజుల్లో మొదలైన ఆ ప్రేమ బంధం ఆనందంగా, అన్యోన్యంగా సాగిందని దివి తెలిపింది. ఇరువురి కుటుంబాలు వారి పెళ్లికి అంగీకరించారు కూడా. కానీ అదే సమయంలో ఒక విషాదకర ఘటన వారి జీవితాలను ఊహించని మలుపు తిప్పిందని ఆమె తెలిపింది. దివి ప్రియుడి తమ్ముడు ఆకస్మికంగా మరణించడం వారి బంధంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ సమయంలో తన ప్రియుడు ఊరిని వదిలి హైదరాబాద్ రాలేకపోవడం ఒక కారణమైతే, దివి లాంటి హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అమ్మాయిని తన ఊరిలో బంధించడం కరెక్ట్ కాదని అతను భావించాడని దివి తెలిపింది. భవిష్యత్తులో దివి కష్టపడకూడదని అతను బ్రేకప్ నిర్ణయం తీసుకున్నాడని దివి తెలిపింది.
ఆ టైంలో చనిపోతా అనుకున్నా.. ఆయనే సాయం చేశారు.. ఎమోష్నలైన పోసాని
ఆ సమయంలో తన ప్రియుడు అడిగి ఉంటే, అన్ని వదిలిపెట్టి ఊరికి వెళ్లేదాన్నని దివి చెప్పుకొచ్చింది. ఈ సంఘటన తనను ఎంతగానో ప్రభావితం చేసిందని, తన ప్రియుడి తమ్ముడు తన కళ్ల ముందే మలేరియా బారిన పడి మరణించాడని దివి తెలిపింది. తన లవర్ తమ్ముడు చనిపోయిన సమయంలో.. ఐదు రోజుల పాటు ఆ ఇంటి బయట కూర్చుని, అన్ని చూసుకున్నాను అని తెలిపింది. పెళ్లికాని అమ్మాయిలు, కోడలు ఇంట్లోకి రాకూడదనే ఆచారాల కారణంగా తను ఇంటి బయటే కూర్చుని దివి ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం తన మాజీ ప్రియుడు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాడని, అతడి భార్య చాలా మంచిదని, పిల్లలు కూడా ఉన్నారని దివి ఆనందం వ్యక్తం చేశారు. తమకి నచ్చిన వాళ్ళు సంతోషంగా ఉంటే లైఫ్ బాగుంటుందని తెలిపింది. నా బాయ్‌ఫ్రెండ్ కానీ, నా లవర్ కానీ, నా పెళ్లైన హస్బెండ్ కానీ నాకు కావాల్సిన క్వాలిటీ ఏదంటే హి షుడ్ బి మై బెస్ట్ ఫ్రెండ్. ఏదైనా చెప్పుకోగలగాలి. నాకు కడుపునొప్పి వస్తుంది, లేదా నాకు ఇలా ఉంది, నాకు అలా ఉంది అంటే తను అర్థం చేసుకోగలగాలి. అలాంటి పర్సన్ అయితే చాలు నాకు అని చెప్పుకొచ్చింది దివి.
ఒకే రోజు పెళ్లి చేసుకున్న ప్రాణస్నేహితులు.. తెలుగులో ఇద్దరూ తోపులే.. వాళ్లు ఎవరంటే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




