మహేష్, పవన్ కళ్యాణ్ అలా.. ప్రభాస్ ఇలా..! స్టార్ హీరోల గురించి ప్రభాస్ శ్రీను ఏమన్నారంటే
ఎన్నో సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రభాస్ శ్రీను. కామెడీ విలన్ గా నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు ప్రభాస్ శ్రీను. స్టార్ హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రల్లోనూ నటించాడు ప్రభాస్ శ్రీను. తాజాగా ప్రభాస్ శ్రీను స్టార్ హీరోల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తెలుగు సినిమాల్లో కమెడియన్ గా రాణిస్తున్నారు.. నటుడు ప్రభాస్ శ్రీను. కామెడీ విలన్ గా ఎన్నోవైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ప్రభాస్ శ్రీను. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో ప్రభాస్ శ్రీను మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో నటించి అలరించారు ప్రభాస్ శ్రీను. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోలతో తన అనుభవాలను పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా సెట్‌లో మూడీగా, తక్కువ మాట్లాడతారని, ఓ మూలకు వెళ్లి పడుకుంటారని లేదా పుస్తకాలు చదువుకుంటారనే వాదనలను ప్రభాస్ శ్రీను ఖండించారు. పవన్ కళ్యాణ్ సాధారణ వ్యక్తి కాదని, ఆయనతో మాట్లాడగలిగే అవకాశం ఉన్నప్పుడు అందరితోనూ మాట్లాడుతారని ప్రభాస్ శ్రీను అన్నారు. ఆయన తోటి నటుల యోగక్షేమాలు అడగడమే కాకుండా, వారి కెరీర్ ప్రణాళికలు, చేస్తున్న సినిమాలు, ఎలా అప్రోచ్ అవుతున్నారో వంటి వివరాలను కూడా అడుగుతారని ప్రభాస్ శ్రీను తెలిపారు.
అతని వల్ల రూ. 20 లక్షల నష్టం.. ఆ జబర్దస్త్ కమెడియన్ నిజస్వరూపం బయటపెట్టిన షేకింగ్ శేషు
దర్శకుడు హరీష్ శంకర్ సినిమాలైన గబ్బర్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి వాటిల్లో పవన్ కళ్యాణ్ చాలా జోవియల్‌గా ఉంటారని, షూటింగ్‌ను ఎంతో ఆస్వాదిస్తారని ప్రభాస్ శ్రీను తెలిపారు. ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ, షూటింగ్ సెట్‌లో ఆయన నటనలో ఎంతో డెడికేషన్ తో ఉంటారని తెలిపారు. అదేవిధంగా ప్రభాస్ గురించి మాట్లాడుతూ, ఆయన నిజ జీవితంలో ఎలా ఉంటారో, తెరపై కూడా అలాగే ఉంటారని, ఆయనలో పెద్దగా మార్పు ఉండదని ప్రభాస్ శ్రీను తెలిపారు. సెట్‌లో కూడా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించదని అభిప్రాయపడ్డారు.
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. రాజా సాబ్ సినిమాలో ఆ సీన్స్ కట్.. సెన్సార్ బోర్టు రివ్యూ
మహేష్ బాబు గురించి ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ, ఆయనతో చాలా సినిమాల్లో పనిచేశానని తెలిపారు. మహేష్ బాబు సెట్‌లో కారవాన్‌కు వెళ్లకుండా అక్కడే కూర్చుంటారని, దర్శకుడి పక్కనే ఉండి సన్నివేశాలపై దృష్టి పెడతారని వివరించారు. శంకర్ పల్లి దగ్గర సర్కారు వారి పాట షూటింగ్ సమయంలో, అలాగే టెన్కాసిలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రీకరణ సమయంలో విపరీతమైన వేడి ఉన్నా కూడా ఆయన సెట్‌లోనే కూర్చునేవారని ప్రభాస్ శ్రీను గుర్తు చేసుకున్నారు. కేవలం లంచ్ బ్రేక్ సమయంలో మాత్రమే కారవాన్‌కు వెళ్తారని, ఇది ఆయన క్రౌడ్ వల్ల ఇబ్బంది కలగకూడదని వెళ్తారని తెలిపారు ప్రభాస్ శ్రీను. మహేష్ బాబు తనతో సరదాగా మాట్లాడతారని, జోకులువేస్తారని, పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్ సిబ్బందితో సన్నిహితంగా ఉంటారని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు. సెట్‌లో ఉన్నవారి ఒత్తిడిని తగ్గించడానికి మహేష్ జోకులు వేస్తారని ప్రభాస్ శ్రీను తెలిపారు.
విలన్ రామిరెడ్డి క్యాన్సర్ వల్ల చనిపోలేదు.. సంచలన విషయం చెప్పిన నటుడు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




