ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. రాజా సాబ్ సినిమాలో ఆ సీన్స్ కట్.. సెన్సార్ బోర్టు రివ్యూ
ప్రభాస్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తోన్న చిత్రం ది రాజాసాబ్. మారుతి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి పండగ కానుకగా జనవరి 09న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫాంటసీ, హారర్, కామెడీ, రొమాన్స్, ఫన్. .ఇలా అన్నీ అంశాలు కలిసిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం ప్రేక్షుకులు , రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జనవరి 9న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. సలార్ లాంటి యాక్షన్ సినిమా, కల్కి లాంటి సోషియో ఫాంటసీ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాతో చాలా కాలం తర్వాత ప్రభాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించాడు మారుతి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్స్, ట్రైలర్లు సినిమా పై భారీ బజ్ క్రియేట్ చేశాయి.
17 ఏళ్ల అమ్మాయి గర్భవతి అని చూపించా.. నాపై కేసులు వేశారు: దర్శకుడు తేజ
కాగా రాజా సాబ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్ నటిస్తున్నారు. మాళవికామోహనన్, రిధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇటీవలే విడుదలైన సెకండ్ ట్రైలర్ సినిమా పై హోప్స్ ను విపరీతంగా పెంచేశారు మూవీ టీమ్.
ఆ సినిమా నుంచి తప్పుకుంటా అని చెప్పా.. అది క్లాసిక్ అవుతుందని అప్పుడే చెప్పా..: కృషవంశీ
ఇదిలా ఉంటే రీసెంట్ గా రాజా సాబ్ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు కేవలం రెండు కట్స్ మాత్రం చెప్పారట.. కాగా సినిమాలోని సీన్స్ లో ఒక తల నరికే సీన్ ను కట్ చేయాలని సెన్సార్ సభ్యులు సూచించారట. అలాగే ఓ సన్నివేశంలో నేలపై రక్తం ఎక్కువగా కనిపించడం కూడా కట్ చేయాలని చెప్పారట. దాంతో ఈ రెండు సీన్స్ సినిమాలో ఉండవని తెలుస్తుంది. ఇక సినిమా అదిరిపోయిందని, ప్రేక్షకులను ఈ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యులు అంటున్నారు. ముఖ్యంగా అభిమానులు సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. మరి సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
EMI కట్టలేదని దాన్ని తీసుకెళ్లారు.. ఎన్నో కష్టాలు చూశా.. ఎమోష్నలైన జబర్దస్త్ నరేష్
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




