ఆయనకు తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన ఓ మహామనిషి: రామ్ గోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు ఆర్జీవీ. తాజాగా వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు.. ఒకప్పుడు క్లాసిక్, ట్రెండ్ సెట్టర్ మూవీస్ తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. దర్శకుడిగా ఒక వెలుగు వెలిగిన ఆర్జీవీ.. ఇప్పుడు అంతగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు. ఆయన ఏం చేసినా అది ఓ పెద్ద వార్తే అవుతుంది. వివాదం లేకుండా వర్మ ఉండలేరు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలతోనే కాదు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం అనేది వర్మకే సాధ్యం.. తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. రామ్ గోపాల్ వర్మ ఓ దర్శకుడి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ డైరెక్టర్ కాళ్ల మీదపడి పాదాభివందనం చేస్తా అని అన్నారు వర్మ. ఇంతకూ ఆయన ఎవరో గురించి చెప్పారంటే..
అతని వల్ల రూ. 20 లక్షల నష్టం.. ఆ జబర్దస్త్ కమెడియన్ నిజస్వరూపం బయటపెట్టిన షేకింగ్ శేషు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. లెజెండరీ దర్శకుడు కే.విశ్వనాథ్ గారి క్లాసిక్ చిత్రం శంకరాభరణం తనపై, తన కెరీర్‌పై చూపిన అద్భుతమైన ప్రభావాన్ని పంచుకున్నారు. వేటగాడు, అడవి రాముడు, డ్రైవర్ రాముడు వంటి కమర్షియల్ చిత్రాలు ఆధిపత్యం చెలాయించే సమయంలో శంకరాభరణం విడుదలైందని, అది సంప్రదాయబద్ధమైన సంగీతంతో, శంకరశాస్త్రి, మంజు భార్గవి వంటి పాత్రలతో ప్రేక్షకులందరినీ, ముఖ్యంగా తనలాంటి విద్యార్థులను అబ్బురపరిచిందని ఆయన వివరించారు. ఆ చిత్రం కేవలం ఒక కళాఖండం కాదని, సంప్రదాయానికి, భారతీయ సంస్కృతికి ఒక ప్రత్యక్ష నిదర్శనమని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఆచారానికి మరో పేరేంటి అంటే శంకరాభరణం” అని ఆయన పేర్కొన్నారు.
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. రాజా సాబ్ సినిమాలో ఆ సీన్స్ కట్.. సెన్సార్ బోర్టు రివ్యూ
శంకరాభరణం చిత్రంలోని ఒక దృశ్యం రామ్ గోపాల్ వర్మకు చాలా ఇష్టమని. వెలుగులో ఉన్న ఒక గొప్ప వ్యక్తి, పాశ్చాత్య సంగీత ప్రభావంతో తన మార్గాన్ని కోల్పోయినప్పుడు, ఒక శిష్యురాలు తనను తిరిగి వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ సన్నివేశాన్ని వర్ణించే క్రమంలో, పాశ్చాత్య సంగీతపు తుఫానుకు రెపరెపలాడుతున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని కాపాడటానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ మహా మనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని వర్మ ఒక కవితాత్మకంగా చెప్పుకొచ్చారు.
విలన్ రామిరెడ్డి క్యాన్సర్ వల్ల చనిపోలేదు.. సంచలన విషయం చెప్పిన నటుడు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




