AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Nihanth: ఈ జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా? ఇప్పుడెలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసా? లేటెస్ట్ ఫొటోస్ వైరల్

జబర్దస్త్ ద్వారా ఎంతో మంది ట్యాలెంటెడ్ నటీనటులు వెలుగులోకి వచ్చారు. జబర్దస్త్ కమెడియన్లలో చాలా మంది ఇప్పుడు సినిమాల్లోనూ బిజీ బిజీగా ఉంటున్నాడు. కాగా ఇదే కామెడీ షోలోనూ నటించి కొందరు పిల్లలు బాగా ఫేమస్ అయ్యారు. తమ ముద్దు ముద్దు డైలాగులతో సెలబ్రిటీలుగా మారిపోయారు.

Jabardasth Nihanth: ఈ జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా? ఇప్పుడెలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసా? లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Jabardasth Artist Nihanth
Basha Shek
|

Updated on: Jan 07, 2026 | 8:16 PM

Share

తెలుగు టెలివిజన్ చరిత్రలో బాగా సక్సెస్ అయిన కామెడీ షోల్లో జబర్దస్త్ ముందుంటుంది. గతంలోలా ఇప్పుడు ఈ కామెడీ షోకు క్రేజ్ లేకపోయినా చాలా మంది ఇప్పటికీ ఈ షోను తప్పకుండా చూస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ లో జబర్దస్త్ వీడియోలకు మంచి రెస్పాన్స్ ఉంటోంది. ఈ సంగతి పక్కన పెడితే జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు చాలా మంది హీరోలు, డైరెక్టర్లుగా, కమెడియన్లుగా, సహాయక నటులుగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్‌ శీను, ఆటో రామ్ ప్రసాద్‌, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, ముక్కు అవినాశ్‌, ధన్ రాజ్, చలాకీ చంటి శాంతి కుమార్‌ ఇలా చాలా మంది ఇండస్ట్రీలో బిజీ బిజీగా ఉంటున్నారు. కాగా ఇదే కామెడీ షోతోనే చాలా మంది పిల్లలు సెలబ్రిటీలుగా మారారు. తమ కామెడీ స్కిట్లతో బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నారు. ముఖ్యంగా రాకింగ్ రాకేష్ టీమ్ లోని నెమలి రాజు, యోధ, దీవెన, నిహాంత్‌లు తమ ముద్దు ముద్దు డైలాగులతో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. ముఖ్యంగా నిహాంత్ టీవీలో కనిపిస్తే పెదాలపై చిరునవ్వు వచ్చేది.

నిహాంత్ విషయానికి వస్తే హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాడు. నిహంత్ కు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ల అమ్మ గారి తో కలిసి ఒక షూటింగ్ కి వెళ్లారట. అక్కడ ఒక సీరియల్ డైరెక్టర్ నిహాంత్ ను చూశాడట. ఆ వెంటనే అతని తల్లిదండ్రులను ఒప్పించి సీరియల్ లో ఒక ఛైల్డ్ ఆర్టిస్ట్ రోల్ కు నిహాన్ ను తీసుకున్నాడట. అలా శ్రీనివాస కళ్యాణం సీరియల్ తో నిహంత్ యాక్టింగ్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత సీతా మహాలక్ష్మీ సీరియల్ లోనూ యాక్ట్ చేశాడీ కుర్రాడు. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన ముద్దు మాటలతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ నిహాంత్ లేటెస్ట్ ఫొటోస్..

కాగా ఇప్పటికే నిహాంత్.. నిన్ను కోరి, మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాల్లో నటించాడు. అయితే ప్రస్తుతం తన ఉన్నత చదువులను పూర్తి చేసే పనిలో ఉన్నాడీ కుర్రాడు. అలాగే యాక్టింగ్, డ్యాన్స్, మ్యూజిక్ కీబోర్డులో ప్రావీణ్యం సంపాదించాడు. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు నిహాంత్. తన పేరెంట్స్, స్నేహితులు, సన్నిహితులతో కలిసి డ్యాన్స్ వీడియోలు చేస్తూ వాటిని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటున్నాడు. అయితే అప్పటికీ , ఇప్పటికీ చాలా మారిపోయాడు నిహాంత్. ప్రస్తుతం ఇతని ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు సినిమాల్లోకి ఎప్పుడొస్తావ్‌? అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి