13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..
నటిగా చాలా సినిమాల్లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది రమ్య శ్రీ. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించింది. ఎక్కవగా ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ చేసి ఆకట్టుకుంది. చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిశారు రమ్యశ్రీ. ఆమె అసలు పేరు సుజాత.

నటి రమ్యశ్రీ.. ఈ పేరు చెప్తే టక్కున గుర్తిపట్టలేకపోవచ్చు కానీ ఆమెను చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. ఎన్నో సినిమాల్లో రకరకాల పాత్రలు చేసి మెప్పించారు రమ్యశ్రీ. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించింది. ఎక్కవగా ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ చేసి ఆకట్టుకుంది. చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిశారు ఈ అందాల తార.. తెలుగమ్మాయి అయినా కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా 30కి పైగా సినిమాల్లో నటించింది రమ్యశ్రీ. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
మహేష్, పవన్ కళ్యాణ్ అలా.. ప్రభాస్ ఇలా..! స్టార్ హీరోల గురించి ప్రభాస్ శ్రీను ఏమన్నారంటే
రమ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ తెరపైకి రాకుండా జాగ్రత్త పడ్డానని రమ్యశ్రీ తెలిపారు. తనకు చిన్నవయసులోనే, అంటే 13 ఏళ్లకే వివాహం జరిగిందని, కొన్నేళ్ల క్రితం తన భర్త మరణించారని తెలిపారు. ఆయనను తన తండ్రితో సమానంగా గౌరవిస్తానని, ఇప్పటికీ గుడిలో దేవుడిలా పూజిస్తానని అన్నారు. అనేక మంది పెద్ద పెద్ద డాక్టర్లు, విదేశీయులు తనను పెళ్లి చేసుకోవాలని అడిగినా, తనకంటూ కొన్ని మోరల్ వాల్యూస్ ఉన్నాయని, వాటిని తాను గౌరవిస్తానని రమ్యశ్రీ అన్నారు. తనకు అవసరమైనవన్నీ ఉన్నాయని, ఒక సెక్యూర్‌డ్ లైఫ్ లభిస్తున్నప్పుడు అత్యాశకు పోవడం అనవసరమని ఆమె అన్నారు.
ఆ టైంలో చనిపోతా అనుకున్నా.. ఆయనే సాయం చేశారు.. ఎమోష్నలైన పోసాని
సినీ పరిశ్రమలో లైంగిక ఒత్తిళ్లు ఉంటాయని రమ్యశ్రీ అన్నారు, అయితే ఇది కేవలం సినిమా రంగానికే పరిమితం కాదని, ఏ వాతావరణంలోనైనా ఒత్తిళ్లు ఉంటాయని పేర్కొన్నారు. బలవంతం చేయడమే తప్పని, నచ్చిన వారిని ఎవరూ ఆపలేరని ఆమె అన్నారు. ఎంతో మంది నిర్మాతలు, దర్శకులు తనను రాంగ్ స్టెప్ వేయమని అడిగినప్పటికీ, తాను ఎప్పుడూ లొంగలేదని స్పష్టం చేశారు. ఒకవేళ సినిమా ఆఫర్లు రాకపోయినా బాధపడనని ఆమె అన్నారు. ఒక నటిగా తన అవసరం వచ్చినప్పుడు సినిమా అవకాశాలు వాటంతట అవే వస్తాయని ఆమె బలంగా నమ్ముతా అని అన్నారు. తన భర్త తన సినీ కెరీర్‌కు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, ఇది తన అదృష్టమని ఆమె పేర్కొన్నారు. ‘నువ్వు నేను’ సినిమా తర్వాత తాను చాలా బిజీ అయ్యానని, ఒక్కోసారి పది రోజులు నిద్రపోకుండా రోజుకు మూడు, నాలుగు షూటింగ్‌లు చేశానని రమ్యశ్రీ తెలిపారు.
ఒకే రోజు పెళ్లి చేసుకున్న ప్రాణస్నేహితులు.. తెలుగులో ఇద్దరూ తోపులే.. వాళ్లు ఎవరంటే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




