AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic: అసలు అమ్మాయేనా ఈ సినిమా తీసింది? ‘టాక్సిక్’ బోల్డ్ సీన్స్‌పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్

కన్నడ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ మూవీ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఇందులోని బోల్డ్ సీన్స్ చూసి యశ్ అభిమానులే షాక్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ టాక్సిక్ టీజర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Toxic: అసలు అమ్మాయేనా ఈ సినిమా తీసింది? 'టాక్సిక్' బోల్డ్ సీన్స్‌పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
Director Ram Gopal Varma, Toxic Movie
Basha Shek
|

Updated on: Jan 08, 2026 | 7:41 PM

Share

పాన్ ఇండియా స్టార్ యశ్ ఇవాళ (జనవరి 8) తన పుట్టినరోజు జరుపుకున్నారు.ఈ సందర్భంగా అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. తన లేటెస్ట్ సినిమా ‘టాక్సిక్’ టీజర్ రూపంలో ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ ఇచ్చా రు. మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ సినిమా చాలా గ్రాండ్ గా, రిచ్ గా కనిపిస్తోంది. అదే సమంయలో టీజర్ కూడా చాలా బోల్డ్ గా ఉంది. ఇందులో హీరో యష్ అవతార్ ను చూసి అందరూ షాక్ అయ్యారు. టాక్సిక్ టీజర్ లో యశ్ ఒక హాలీవుడ్ నటితో చాలా బోల్డ్ గా కనిపించాడు. ఇంటిమేట్ సీన్స్ తోనూ షాక్ ఇచ్చాడు. యశ్ టాక్సిక్ టీజర్ లో ఇలాంటి సీన్స్ ఉంటాయని ఫ్యామిలీ ఆడియన్స్ అసలు ఊహించలేదు. మరీ ముఖ్యంగా ఓ లేడీ డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా రావడంపై చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సంచలన దర్శకుడు టాక్సిక్ మూవీ టీజర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

టాక్సిక్ మూవీ డైరక్టర్ గీతూ మోహన్ దాస్ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ‘ఈరోజు విడుదలైన యశ్ టాక్సిక్ టీజర్ చూసిన తర్వాత నాకు ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించింది అంటే ఆశ్చర్యం వేసింది. ఆమె మహిళలకు ఒక అల్టిమేట్ రోల్ మోడల్ గా నేను భావిస్తున్నాను. ఏ మగ డైరెక్టర్ కూడా ఈమెకు సరితూగరు. ఈ టీజర్ లో వచ్చే ఒక షాట్ ని నిజంగా ఆమె తెరకెక్కించింది అంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను ‘ అని రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

రామ్ గోపాల్ వర్మ ట్వీట్..

రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన గీతూ మోహన్ దాస్ ఇప్పటివరకు పెద్దగా కమర్షియల్ సినిమాలేమీ తీయలేదు. ఇప్పుడు మొదటి సారిగా ఓ పాన్ ఇండియా హీరోతో కలిసి ఓ పెద్ద సినిమా తెరకెక్కిస్తోంది.

టాక్సిక్ సినిమా టీజర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..