AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jana Nayakudu: దళపతి విజయ్ ‘జన నాయకుడు’ రిలీజ్ వాయిదా.. అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు

దళపతి విజయ్ నటించిన జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) సినిమా జనవరి 9 విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్‌కు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసులో తీర్పు కూడా జనవరి 9నే వెలువడనుంది. దీంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Jana Nayakudu: దళపతి విజయ్ 'జన నాయకుడు' రిలీజ్ వాయిదా.. అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు
Jana Nayakudu Movie
Basha Shek
|

Updated on: Jan 08, 2026 | 6:00 AM

Share

దళపతి విజయ్ నటించిన జననాయగన్ సినిమా విడుదల వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా జనవరి 9 న విడుదల చేయనున్నట్లు ఇది వరకే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ సెన్సార్ సర్టిఫికెట్ కు సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. ఈ కేసు తీర్పు కూడా జనవరి 9నే రానుంది. దీంతో తమ సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ‘మా నియంత్రణకు మించిన అనివార్య పరిస్థితులు కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని విలైనంత త్వరగా ప్రకటిస్తాము. మీ అందరి మద్దతు మా జన నాయగన్ బృందానికి గొప్ప బలం’ అని కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా జన నాయకుడు సినిమా విడుదల వాయిదాతో విజయ్ అభిమానులను తీవ్ర నిరాశలో మునిగిపోయారు.ఈ సినిమా సెన్సార్‌షిప్ అంశం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సెన్సార్ సర్టిఫికేట్ ఇంకా జారీ కాకపోవడంతో నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు, ఈ కేసులో జనవరి 9, 2026న తీర్పు వెలువరిస్తామని ప్రకటించింది. ఆ రోజే సినిమా విడుదల తేదీని ప్రకటించగా, విడుదలలో సమస్యల కారణంగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.

దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం కావడంతో జన నాయకుడు పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రీ బుకింగ్స్ కూడా భారీగా జరిగాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా సినిమా వాయిదా పడడంతో విజయ్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

జన నాయకుడు నిర్మాతల ప్రకటన..

పరాశక్తి కూడా..

జన నాయకుడు సినిమాతో పాటు శివ కార్తికేయన్ నటించిన పరాశక్తికి ఇంకా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వలేదని వార్తలు వస్తున్నాయి. పరాశక్తిని సమీక్ష కమిటీకి పంపారు. సెన్సార్ సభ్యులు సినిమా చూసిన తర్వాత, చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంకా అధికారిక ప్రకటనేమీ రాలేదని తెలుస్తోంది. ఇవాళ (జనవరి 8)న ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే, జన నాయకుడితో పాటు ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు, చిత్ర బృందం ముమ్మరంగా ప్రమోషన్ పనుల్లో నిమగ్నమై ఉండటం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
ఆ దేవుడిని దర్శిస్తే జుట్టు పెరుగుతుందని నమ్ముతారని తెలుసా?
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !