Actress Indraja: తెలుగు బ్రాహ్మీన్ అయిన ఇంద్రజ.. ముస్లిం వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే..?
నటి ఇంద్రజ తన ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్ గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను తెలుగు బ్రాహ్మిణ్‌నని, ముస్లిం అయిన తన భర్తను మతం చూసి కాదని, మనసు చూసి ఇష్టపడి ఆరేళ్ల స్నేహం తర్వాత పెళ్లి చేసుకున్నానని ఆమె తెలిపారు. తన భర్త రచయిత, యాడ్ ఫిల్మ్‌మేకర్, వ్యాపారవేత్త అని, తన కెరీర్‌లో ఆయన పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఇంద్రజ వెల్లడించారు.

నటి ఇంద్రజ గతంలో ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన ఇంటర్ ఫెయిత్ మ్యారేజ్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. తాను ఒక తెలుగు బ్రాహ్మిణ్‌నని, ముస్లిం అయిన తన భర్తను పెళ్లి చేసుకోవడానికి గల కారణం గురించి అడిగిన ప్రశ్నకు, మనసు చూసి మాత్రం ఇది జరిగిందని.. ఒకరినొకరు ఇష్టపడ్డాక.. అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. మతం చూసి, కులం చూసి పెళ్లి చేసుకోవడం జరగదని, తమ వేవ్‌లెంగ్త్ సరిపోవడంతోనే తాము పెళ్లి చేసుకున్నామని ఇంద్రజ స్పష్టం చేశారు. ఇంద్రజ, ఆమె భర్త ఆరు సంవత్సరాల పాటు స్నేహితులుగా ఉన్నారని తెలిపారు. కేవలం పరిచయం అయిన వెంటనే వివాహం చేసుకోలేదని, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే, జీవితంలో ఒకరికొకరు పూర్తి సపోర్ట్ సిస్టమ్‌గా ఉండగలరని నమ్మకం కుదిరిన తర్వాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని ఆమె వివరించారు. ఇది ఇద్దరిలోనూ కలిగిందని, అలా ఒక రోజు చెన్నైలో వివాహం చేసుకున్నారని ఇంద్రజ చెప్పారు.
ఇంద్రజ భర్త వృత్తిపరంగా రచయిత. యాడ్ ఫిల్మ్‌మేకర్‌గా పనిచేస్తారు. ఆయన యాడ్ ఫిల్మ్స్, సీరియల్స్‌లో నటించారు కూడా. ఇవి మాత్రమే కాకుండా వారికి కుటుంబ వ్యాపారం కూడా ఉంది. ఇంద్రజ వాళ్ల మామగారిది గవర్నమెంట్ ఎక్స్‌పోర్ట్స్ వ్యాపారం. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్‌కు కార్గో సప్లై చేస్తుంటారు. తన సినిమాల ఎంపిక విషయంలో తన భర్త పాత్ర గురించి మాట్లాడుతూ, ఆయన మంచి రచయిత అని, ఏదైనా కథ ఉంటే చెబుతారని వెల్లడించారు. తాను చేసే సినిమాలు, పాత్రల గురించి అడిగితే ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేస్తారని, “ఇది బాగుంటుందా, ఇది సూట్ అవుతుందా” అని అడిగితే మాత్రమే సలహా ఇస్తారని ఇంద్రజ పేర్కొన్నారు. కానీ “ఇది చెయ్యి, ఇది చేయకూడదు” అని మాత్రం ఎప్పుడూ చెప్పరని, తన పనిలో ఆయన అంతవరకు జోక్యం చేసుకోరని నటి ఇంద్రజ వివరించారు. వారి బంధం పరస్పర గౌరవం, మద్దతుపై ఆధారపడి ఉందని ఆమె మాటల్లో స్పష్టమైంది.
