వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే
కొంతమంది హీరోయిన్స్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. హీరోలతో సమానంగా నటిస్తూ మెప్పిస్తున్నారు. అలాగే హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ రాణిస్తున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. రీసెంట్ గా ఈ వయ్యారి భామ భారీ విజయాన్ని అందుకుంది. ఆమె నటించిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

కొంతమంది ఓవర్ నైట్ లో పాపులర్ అవుతుంటారు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. తాజాగా ఓ అమ్మడు ఏకంగా ప్రభాస్, దళపతి విజయ్ లాంటి బడా హీరోలను సైతం వెనక్కి నెట్టింది. ఆమె వయసు 20ఏళ్లు మాత్రమే.. చిన్నవయసులోనే హీరోయిన్ గా దుమ్మురేపుతోంది. ఇటీవలే ఆమె నటించిన సినిమా ఏకంగా రూ. 1000 కోట్లలకుపైగా వసూల్ చేసింది. దాంతో ఒక్కసారిగా పాపులర్ సెలబ్రెటీ అయ్యింది ఈ అమ్మడు. ప్రముఖ సంస్థ IMDb విడుదల చేసిన లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఈ అందాల భామ. ప్రభాస్, దళపతి విజయ్ లను కూడా బీట్ చేసింది ఈ అందాల భామ. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..
మహేష్, పవన్ కళ్యాణ్ అలా.. ప్రభాస్ ఇలా..! స్టార్ హీరోల గురించి ప్రభాస్ శ్రీను ఏమన్నారంటే
సారా అర్జున్ .. ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. చియాన్ విక్రమ్ నటించిన నాన్న మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ అదరగొట్టింది ఈ చిన్నది. ఆతర్వాత పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది. ముంబైలో జన్మించిన సారా.. ఎ.ఎల్. విజయ్ తెరకెక్కించిన థీవత్ తిరుమగల్ (తెలుగులో నాన్న) సినిమాలో విక్రమ్ కూతురిగా నటించింది. అప్పుడు ఆమె వయసు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఆ టైంలో చనిపోతా అనుకున్నా.. ఆయనే సాయం చేశారు.. ఎమోష్నలైన పోసాని
ఇటీవలే బాలీవుడ్ మూవీ దురంధర్ సినిమాలో నటించి ఆకట్టుకుంది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఏకంగా వెయ్యికోట్లకు పైగా వసూల్ చేసింది.. ఇప్పటికీ థియేటర్స్ లో దూసుకుపోతుంది ఈ సినిమా. కాగా సారా అర్జున్ ఈ కొత్త ఏడాదిలో మోస్ట్ పాపులర్ సెలబ్రెటీగా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా IMDb సంస్థ విడుదల చేసిన లిస్ట్ లో సారా అర్జున్ టాప్ ప్లేస్ లో ఉంది. ఆమె తర్వాత మిగిలిన స్టార్స్ ఉన్నారు.
ఒకే రోజు పెళ్లి చేసుకున్న ప్రాణస్నేహితులు.. తెలుగులో ఇద్దరూ తోపులే.. వాళ్లు ఎవరంటే
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




