AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SHRESHTA 2026 Exam: మరో 2 రోజుల్లో నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌ ఇదే

SHRESHTA 2026 Admit Card download link: నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ- నెట్స్‌ 2026 రాత పరీక్షఆదివారం (డిసెంబర్ 21) దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) నిర్వహించనుంది. ఈ క్రమంలో ఎన్టీయే అడ్మిట్‌ కార్డులు విడుదల చేసింది. శ్రేష్ఠ- నెట్స్‌ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక..

SHRESHTA 2026 Exam: మరో 2 రోజుల్లో నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌ ఇదే
SHRESHTA 2026 Exam
Srilakshmi C
|

Updated on: Dec 18, 2025 | 10:56 AM

Share

హైదరాబాద్‌, డిసెంబర్‌ 18: నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ- నెట్స్‌ 2026 రాత పరీక్షఆదివారం (డిసెంబర్ 21) దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) నిర్వహించనుంది. ఈ క్రమంలో ఎన్టీయే అడ్మిట్‌ కార్డులు విడుదల చేసింది. శ్రేష్ఠ- నెట్స్‌ 2026 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. శ్రేష్ఠ పరీక్ష పెన్‌, పేపర్‌ విధానంలో ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. డిసెంబర్‌ 21న దేశవ్యాప్తంగా 106 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది.

కాగా కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ- నెట్స్‌ పథకానికి సంబంధించి యేటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ బాలబాలికలు సీబీఎస్‌ఈ అనుబంధ ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో తొమ్మిది, పదకొండు తరగతుల్లో ప్రవేశాలు పొందవచ్చు. శ్రేష్ఠ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 3 వేల సీట్లను భర్తీ చేయనున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 8, 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులు స్కీం ఫర్‌ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్‌ స్టూడెంట్స్‌ ఇన్‌ హై క్లాసెస్‌ ఇన్‌ టార్గెటెడ్‌ ఏరియాస్‌ (శ్రేష్ఠ) 2026 పథకం కింద పరీక్షకు హాజరుకానున్నారు. రాత పరీక్ష అనంతరం 4 నుంచి ఆరు వారాల్లోపు ఫలితాలు వెల్లడిస్తారు.

నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ 2026 అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

రేపట్నుంచి ఏపీపీ పోస్టులకు ఇంటర్వ్యూలు

ఆంధ్రప్రదేశ్‌లోని అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) పోస్టుల భర్తీకి ఇటీవల నిర్వహించిన రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు డిసెంబరు 19 నుంచి 22 వరకూ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ మేరకు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ మీనా ప్రకటన వెలువరించారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులు నిర్దేశిత తేదీల్లో ఒరిజినల్‌ సర్టిఫికేట్లతో ఇంటర్వ్యూకి హాజరుకావల్సి ఉంటుంది.

మరన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు