AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ పందిగాడికి లక్షల కట్నం, ఖరీదైన కారు కావాలట..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్‌! వీడియో

అసలే ఏనుగంత దేహం.. ఎలాగోలా ఓ అమాయకురాలు ఆ భారీ ఏనుగుతో పెళ్లికి ఒప్పుకుంది. హమ్మయ్యా.. పెళ్లవుతుందిలే అని అనుకోకుండా గొంతెమ్మ కోరికలకుపోయాడు. తాళికట్టే సమయంలో అలిగి అటకెక్కాడు. లక్షల కట్నం, ఖరీదైన కారు ఇస్తేనే తాళికడతానని బుంగమూతి పెట్టాడు. అంతే.. చిర్రెత్తుకొచ్చిన వధువు దిమ్మతిరిగే ట్విస్ట్‌ ఇచ్చింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో శుక్రవారం (డిసెంబర్‌ 12) రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..

Viral Video: ఈ పందిగాడికి లక్షల కట్నం, ఖరీదైన కారు కావాలట..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్‌! వీడియో
Bride Calls Off Wedding After Groom Demands Dowry
Srilakshmi C
|

Updated on: Dec 15, 2025 | 1:31 PM

Share

లక్నో, డిసెంబర్‌ 15: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో సదర్ బజార్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుక జరుగుతుంది. వరుడు వ్యాపారవేత్త అయిన రిషబ్. పెళ్లి బారత్‌తో యుగ్వీనా లైబ్రరీ సమీపంలోని పెళ్లి మండపానికి వచ్చాడు. అయితే మరికొన్ని నిమిషాల్లో తాళి కట్టనుండగా.. ఇంతలో మండపంలో కలకలం రేగింది. వరుడు రిషబ్‌ తనకు ఉన్నపలంగా బ్రెజ్జా కారు, రూ. 20 లక్షల నగదు కట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తన డిమాండ్లు నెరవేర్చకపోతే పెళ్లిని రద్దు చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. వరుడు రిషబ్‌ను ఒప్పించేందుకు ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయిందని వధువు తండ్రి మురళీ మనోహర్ తెలిపారు.

ఇంతలో ఈ యవ్వారం కాస్తా వధువు చెవిన పడటంతో.. ఈ దురాశపరుడిని నేను వివాహం చేసుకోవాలనుకోవడం లేదు అని అందరి ముందు ప్రకటించింది. తన కుటుంబ నిస్సహాయతను చూసి, వధువు ఇంద్రపాల్ పెళ్లి రద్దు చేసింది. నా కుటుంబాన్ని గౌరవించని అబ్బాయితో కలిసి జీవించలేను అని ఆమె చెప్తున్న వీడియో సామాజిక మాధ్యామాల్లో వైరల్‌గా మారింది. నా తండ్రిని, సోదరుడిని కట్నం కోసం అతిథులందరి ముందు అవమానించాడు. భవిష్యత్తులో నన్ను ఎలా గౌరవిస్తాడు? అలాంటి దురాశపరుడిని వివాహం చేసుకోలేను.. అని వీడియోలో వధువు ఇంద్రపాల్ చెప్పుకొచ్చింది. దీంతో పెళ్లింట వాగ్వాదం జరిగింది. కంటోన్మెంట్ పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వరుడు రిషబ్, అతని తండ్రి రామ్ అవతార్, అతని బావమరిదిని అదుపులోకి తీసుకున్నారు. వధువు వైపు నుండి అధికారిక ఫిర్యాదు అందిన తర్వాత తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంటోన్మెంట్ పోలీసు అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి

సిక్లాపూర్‌కు చందిన ఇంద్రపాల్ అనే యువతితో 8 నెలల క్రితం రిషబ్‌కు వివాహం నిశ్చయమైందని వధువు తండ్రి మురళీ మనోహర్ తెలిపారు. వివాహం నిశ్చయించే సమయంలో, వరుడి తండ్రి మా కుమార్తెకు ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చి పంపమని, కట్నం వద్దని చెప్పారు. మే నెలలో ఓ హోటల్‌లో నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు రూ.3 లక్షలు ఖర్చు పెట్టాం. నిశ్చితార్ధంలో వరుడికి బంగారు ఉంగరం, గొలుసు, రూ.5 లక్షల నగదు కూడా ఇచ్చాం. ఆ తర్వాత వారి డిమాండ్లు మరింత ఎక్కువయ్యాయి. మా కూతురు సంతోషంగా ఉంటుందని భావించి మేము వాటిని నెరవేరుస్తూ వచ్చాం.

పెళ్లికి ఒక రోజు ముందు పెళ్లి ఆహ్వాన పత్రికతో వరుడి ఇంటికి వెళ్లగా.. ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, గృహోపకరణాలు, నగలు, రూ. 1.2 లక్షల నగదుతో సహా అనేక వస్తువులను కట్నంగా వధువుతోపాటు పంపించాలని అన్నారు. పెళ్లి మండపం ఖరీదైనా హోటల్‌లో ఏర్పాటు చేయాలని కోరడంతో అందుకూ అంగీకరించాం.. చివరకు తాళి కట్టే సమయంలో రూ.20 లక్షల నగదు, ఖరీదైనా కారు కట్నంగా ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు.. అని వధువు తండ్రి మురళీ మనోహర్ మీడియాకు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.