UPSC Jobs 2025: రాత పరీక్షలేకుండానే యూపీఎస్సీలో ఉద్యోగాలు.. ఎంపికైతే లక్షల్లో జీతం
UPSC CGPDTM Examiner Recruitment 2025 notification: వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జామినర్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ అండ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్, డిప్యూటీ డైరెక్టర్ (ఎగ్జామినేషన్ రిఫార్మ్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనుంది..

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జామినర్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ అండ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్, డిప్యూటీ డైరెక్టర్ (ఎగ్జామినేషన్ రిఫార్మ్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో ఎగ్జామినర్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ & జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ పోస్టులు 100, డిప్యూటీ డైరెక్టర్ (ఎగ్జామినేషన్ రిఫార్మ్స్) పోస్టులు 2 ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబరు 13వ తేదీ నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండిడ..
యూపీఎస్సీలోని పోస్టులను ఆఫీస్ ఆఫ్ ది కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ & ట్రేడ్ మార్క్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ.. విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో అంటే హ్యుమానిటీస్/ సైన్స్/ కామర్స్ / ఇంజినీరింగ్/ టెక్నాలజీ / లా/ మేనేజ్‌మెంట్/ ఫైనాన్స్/ అకౌంట్స్‌లో డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ లేదా పీహెచ్‌డీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో ఉద్యోగానుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 30 ఏళ్ల నుంచి 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో జనవరి 1, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్థులు రూ.25 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడౠ్ల్యబీడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే కేవలం విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండడి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








