ED Jobs 2025: డిగ్రీ అర్హతతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
ED Legal Consultant 2025 Notification: న్యూఢిల్లీలోని మనీలాండరింగ్ (PMLA), విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కింద పనిచేసే డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం..

కేంధ్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని న్యూఢిల్లీలోని మనీలాండరింగ్ (PMLA), విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) కింద పనిచేసే డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్.. ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 75 లీగల్ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 30, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో లీగల్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో లా డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బార్ అసోసియేషన్ జారీ చేసిన అనుభవం సర్టిఫికెట్ కూడా ఉండాలి. కనీసం సంబంధిత విభాగంలో మూడేళ్ల పాటు పని అనుభవం అవసరం. LLM degree ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 2025 డిసెంబర్ 30వ తేదీ నాటికి 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్ విధానంలో ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు పంపిచవల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.80,000 చొప్పున జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు అందిస్తారు. అలాగే ఎంపికైన అభ్యర్ధులు దేశంలో ఏదైనా ప్రదేశంలో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇతర వివరాలు ఈ కింది అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఈమెయిల్ ఐడీ: ddlegal-ed@gov.in
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.








