Andhra: ఎంత పనిచేశావ్ స్వప్న.. నిన్న ప్రియుడితో పెళ్లి.. కులం వేరని ఒప్పుకోని అత్త.. అంతలోనే
ఇద్దరిది వేరు వేరు కులాలు.. అయినా.. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.. పోలీసుల సమక్షంలో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే.. ప్రియుడి తల్లి, బంధువులు ఒప్పుకోకపోవడంతో.. యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.. ఇది తెలుసుకుని యువతి ఆత్మహత్యకు పాల్పడింది..

ఇద్దరిది వేరు వేరు కులాలు.. అయినా.. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు.. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.. పోలీసుల సమక్షంలో కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే.. ప్రియుడి తల్లి, బంధువులు ఒప్పుకోకపోవడంతో.. యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.. ఇది తెలుసుకుని యువతి ఆత్మహత్యకు పాల్పడింది.. కులాంతర వివాహం విషాధంగా మారిన ఘటన.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో కలకలం రేపింది.. నిన్న పెద్దల సమక్షంలో జరిగిన వివాహాన్ని.. ప్రియుడి తల్లి, బంధవులు ఒప్పుకోక పోవడంతో మొదట యువకుడు అత్మహత్యయత్నం పాల్పడగా, యువతి ఉరేసుకొని అత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో యువతి మృతి చెందగా యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. ఈ సంఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానందిలో సంచలనంగా మారింది..
మహానంది మండలం ఈశ్వర్ నగర్ చెందిన శివప్రసాద్, స్వప్న గత మూడేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరైన తాము ఇద్దరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోవాలని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. ఎందరు వద్దన్నా తాము వివాహం చేసుకుంటామని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కొందరు పెద్ద మనుషుల సమక్షంలో యువతి, యువకులు పోలీస్ స్టేషన్ ఆవరణలో పెళ్లి చేసుకున్నారు. అయితే.. ఈ పెళ్లిని అబ్బాయి తల్లి లక్షీదేవి ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఇంట్లో అత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి.. ప్రియుడు అత్మహత్య చేసుకున్నాడనే మనస్తాంతో మహానంది శివారులోకి వెళ్ళి చెట్టుకు ఉరేసుకొని అత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు కులాలు వేరు వేరు కావడం పెద్దలు ఒప్పుకోక పోవడంతో ఓ నిండు ప్రాణం బలైంది. ప్రస్తుతం శివప్రసాద్ నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వీడియో చూడండి..
కానీ, యువతి అత్మహత్యపై యువతి తల్లి మరియమ్మ, ఆమె బంధవులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూన్నారు. మృతురాలు స్వప్నను యువకుడు శివప్రసాద్ బంధువులే చంపి చెట్టుకు ఉరేసి చంపారని అరోపిస్తన్నారు. స్వప్న మృతికి శివప్రసాద్ తల్లి, బంధువులె కారణం అంటూ ఆరోపిస్తున్నారు.
యువతి స్వప్న మృతిపై తల్లి మరియమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన మహానంది పోలీసులు దర్యాప్తు చేస్తూన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
