EPFO: ఉద్యోగులకు అలర్ట్.. ఒక్క నిమిషంలోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఎలాగంటే
కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఈపీఎఫ్ఓలో 7 కోట్లకు పైగా చందాదారులు ఉన్నారు. ఈపీఎఫ్ఓ ఉద్యోగి, యజమాని (సంస్థ) రెండింటి నుంచి విరాళాలను సేకరించి.. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. అయితే.. ఉద్యోగం చేస్తున్న దాదాపు అందరికీ ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) గురించి అవగాహన ఉంటుంది.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. చందదారుల సౌలభ్యం కోసం ఎన్నో సంస్కరణలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకప్పుడు బ్యాలెన్స్ తనఖీ నుంచి పీఎఫ్ విత్‌డ్రా, క్లయిమ్ కోసం చాలా ప్రాసెస్ ఉండేది.. కానీ.. ఇప్పుడు అలా కాదు.. ఈపీఎఫ్ఓ డిజిటలైజేషన్ ద్వారా.. ఎన్నో పనులు సులభంగా అవుతున్నాయి.. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఈపీఎఫ్ఓలో 7 కోట్లకు పైగా చందాదారులు ఉన్నారు. ఈపీఎఫ్ఓ ఉద్యోగి, యజమాని (సంస్థ) రెండింటి నుంచి విరాళాలను సేకరించి.. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. అయితే.. ఉద్యోగం చేస్తున్న దాదాపు అందరికీ ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) గురించి అవగాహన ఉంటుంది. అయితే కొందరికి పీఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు ఉందనే విషయం తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వారు ఈజీగా.. పీఎఫ్ బ్యాలెన్స్ ను నిమిషాల్లోనే చెక్ చేసుకోవచ్చు..
పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి?.. ఎలాంటి మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు.. పూర్తి వివరాల కోసం మీరు ఈ క్రింది పద్ధతులను అనుసరించండి..
మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్..
UAN పోర్టల్‌లో ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ చేసుకున్న సభ్యులు.. తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా EPFOలో బ్యాలెన్స్ ఎంత ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. 9966044425 ఫోన్ చేయగానే.. అది వెంటనే డిస్‌కనెక్ట్ అవుతుంది. దీని తరువాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందనే వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి..
ఎస్ఎమ్ఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్..
యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న పీఎఫ్ సభ్యులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు ఎస్ఎమ్ఎస్ పంపడం ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. EPFOHO UAN ఫార్మాట్‌లో UAN నంబర్‌ను యాడ్ చేసి.. భాష కోసం కోడ్ (TEL) ను వెల్లడించాలి. ఇది దాదాపు పది భాషల్లో అందుబాటులో ఉంది.. ఈ నంబర్ కు పంపగానే మెస్సెజ్ వస్తుంది.
EPFO పోర్టల్:
అధికారిక EPFO వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ చేయొచ్చు.. దీనిలో ‘సర్వీసెస్’ విభాగానికి వెళ్లి, మీ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయడానికి ‘ఉద్యోగుల కోసం’ (For Employees) ఎంచుకోండి. దీనిలో యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) పాస్‌వర్డ్ వివరాలను ఎంటర్ చేసి.. బ్యాలెన్స్ ను తనిఖీ చేయొచ్చు..
ఉమాంగ్ యాప్:
మీ ఫోన్ లో ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా.. దీనిలో మీ EPF బ్యాలెన్స్‌ను తనిఖీ చేయిచ్చు.. ఇలా మీ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ గురించి ఈజీగా తెలుసుకోవచ్చు..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




