ఆ ఊరి చెరువులో రాత్రికి రాత్రే మొసళ్లు ప్రత్యక్ష్యం.. భయంతో జనాలు గజగజ!
crocodiles in village pond: అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదుగానీ రెండు మొసళ్లు ఆ ఊరి చెరులో ఉన్నట్లుండి ప్రత్యక్షమయ్యాయి. దీంతో లంకగ్రమాల జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. వివరాల్లోకెళ్తే..

అంబేద్కర్ కోనసీమ, డిసెంబర్ 13: అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం అయినవిల్లి లంకలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదుగానీ రెండు మొసళ్లు ఆ ఊరి చెరులో ఉన్నట్లుండి ప్రత్యక్షమయ్యాయి. దీంతో లంకగ్రమాల జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. వివరాల్లోకెళ్తే..
నిన్నమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఈ వానలకు చెరువులు, వాగులు, నదులన్ని పొంగి పొర్లాలి. చాలా చోట్ల వరదలు కూడా వచ్చాయి. అయితే ఈ వరద నీటికి రెండు మొసళ్లు కొట్టుకొచ్చి అయినవిల్లి లంక పొలాల్లో ఉండిపోయాయి. అయినవిల్లి లంకలో మొసళ్ళ కలకలం స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. దీంతో లంకగ్రమాల ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురౌతున్నారు. లంక పంట భూముల్లో ఎక్కడపడితే అక్కడ ఈ రెండు రెండు మొసళ్ళు సంచరిస్తున్నాయి. ముఖ్యంగా రైతులు పొలాలకు వెళ్ళడానికి బయపడిపోతున్నారు.

ఇటీవల వరద నీరు తగ్గడంతో గోతుల్లో ఊబి నీటిలోనే మొసళ్ళు ఊడిపోయాయి. లంక భూములలో పనులు చేసేందుకు వెళ్ళడానికి రైతులు, కూలీలు బయపడిపోతున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ అధికారులు మొసళ్ళను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. మొసళ్ళు ఉన్న ప్రాంతంలో అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, జనాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక మొసళ్లను పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేసి నీటిని బయటకు తోడే ఏర్పాట్లు ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




