MAT 2025 Exam Date: వారంలో మ్యాట్ 2025 రాత పరీక్ష.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న దరఖాస్తులు
MAT December 2025 Application last date: మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) డిసెంబర్ 2025 ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీని ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్ష తేదీని వెల్లడించింది. ప్రస్తుతం మ్యాట్ 2025 డిసెంబర్ ఆన్‌లైన్ దరఖాస్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన..

హైదరాబాద్, డిసెంబర్ 15: మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (మ్యాట్) డిసెంబర్ 2025 ఆన్‌లైన్ రాత పరీక్ష తేదీని ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్ష తేదీని వెల్లడించింది. ప్రస్తుతం మ్యాట్ 2025 డిసెంబర్ ఆన్‌లైన్ దరఖాస్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గడువు సోమవారం (డిసెంబర్ 15)తో ముగియనున్నట్లు ప్రకటించింది. ఇక మ్యాట్ డిసెంబర్ 2025 పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్ రాత పరీక్ష దేశవ్యాప్తంగా పలు కేంద్రాలలో డిసెంబర్ 21న జరగనుంది.
ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు డిసెంబర్ 18న అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు ఏఐఎంఏ తన ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రముఖ బిజినెస్ స్కూల్లలో ప్రవేశానికి యేటా నాలుగు సార్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మ్యాట్ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా మేనేజ్‌మెంట్ సంస్థలలోని ఎంబీఏ, పీజీడీఎం ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. డిసెంబర్ సెషన్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ కింది అధికారిక వెబ్‌సైట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మ్యాట్ డిసెంబర్ 2025 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఐసీఎస్‌ఐ CS 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. రాత పరీక్ష తేదీలివే!
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI).. సీఎస్ ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్స్ పరీక్షకు సంబంధించిన డిసెంబర్ 2025 అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ మేరకు హాల్‌టికెట్స్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఐసీఎస్‌ఐ CS 2025 రాత పరీక్షలు డిసెంబర్ 22 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
ఐసీఎస్‌ఐ CS 2025 అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








