RBI Internships 2026: ఆర్‌బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేశారా..? మరికొన్ని గంటలే ఛాన్స్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 2026 సంవత్సరానకి సంబంధించి సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్, లా, కామర్స్, ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఐదేళ్ల కోర్సులు, దేశంలోని ప్రఖ్యాత సంస్థలు, కాలేజీల నుంచి లా కోర్సుల్లో మూడేళ్ల పూర్తి సమయం..

హైదరాబాద్, డిసెంబర్ 15: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) 2026 సంవత్సరానకి సంబంధించి సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు, మేనేజ్‌మెంట్, స్టాటిస్టిక్స్, లా, కామర్స్, ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఐదేళ్ల కోర్సులు, దేశంలోని ప్రఖ్యాత సంస్థలు, కాలేజీల నుంచి లా కోర్సుల్లో మూడేళ్ల పూర్తి సమయం ప్రొఫెషనల్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారితోపాటు, ప్రస్తుతం చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు కూడా ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 15వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు ముగింపు సమయంలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌బీఐ సూచించింది. అక్టోబర్ 15 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇక ఆర్‌బీఐ ఇంటర్న్‌షిప్ 2026 ప్రోగ్రామ్ ఏప్రిల్ నుంచి జులై వరకు 3 నెలల పాటు జరగనుంది. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలు జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.20,000 చొప్పున స్టైపెండ్ అందిస్తారు. కాగా ఆర్‌బీఐ ప్రతీయేటా గరిష్ఠంగా 125 మంది విద్యార్థులను ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేస్తుంది. ఈ ఏడాదికి ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థుల పేర్లను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వెల్లడించనున్నారు. ఎంపికైన వారికి మొత్తం 3 నెలల పాటు సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ అందిస్తారు.
ఆర్‌బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇంటర్న్‌షిప్ కార్యక్రమం.. ఎకనామిక్స్, బ్యాంకింగ్, Monetary Policy, ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పరిశోధన రంగాలలో ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా ఆర్‌బీఐ పనితీరును తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక విధాన రూపకల్పనలోనూ భాగం కావచ్చు. అంతేకాకుండా ఆర్‌బీఐలో పలువురి నిపుణుల పర్యవేక్షణలో కీలక ప్రాజెక్టుల్లో పనిచేయవచ్చు. ముఖ్యంగా పోస్ట్-గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు ఈ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ద్వారా అకడమిక్ జ్ఞానాన్ని వాస్తవ ప్రపంచ సవాళ్లకు అన్వయించే అవకాశం దొరుకుతుంది. కెరీర్‌కు ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
ఆర్‌బీఐ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








