JEE Advanced 2026 Syllabus: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష సిలబస్ విడుదల.. సబ్జెక్ట్ వారీగా టాపిక్స్ డౌన్‌లోడ్ లింక్ ఇదిగో
JEE Advanced 2026 syllabus out: జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2026)పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ జారీ చేసింది. యేటా లక్షలాది మంది ఈ పరీక్షకు పోటీ పడుతుంటారు. 2026 యేడాదికి ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూల్‌ను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రకటించింది. ఇప్పటికే జేఈఈ మెయిన్ రెండు విడతల షెడ్యూలన్‌లను ప్రకటించిన ఎన్టీయే..

హైదరాబాద్, డిసెంబర్ 15: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షకు దేశ వ్యాప్తంగా ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యేటా లక్షలాది మంది ఈ పరీక్షకు పోటీ పడుతుంటారు. 2026 యేడాదికి ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూల్‌ను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రకటించింది. ఇప్పటికే జేఈఈ మెయిన్ రెండు విడతల షెడ్యూలన్‌లను ప్రకటించిన ఎన్టీయే ఈ మేరకు అడ్వాన్స్‌డ్ తేదీని కూడా ప్రకటించింది. జేఈఈ మెయిన్ 2026 తొలి విడతలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ముగిసిన సంగతి తెలిసిందే. మరో 5 రోజుల్లో జేఈఈ మెయిన్ తొలి విడత ఆన్‌లైన్ రాత పరీక్షలు మొదలుకానున్నాయి. ఇక సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీల మధ్య నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌లో తెలిపింది. ఈ రెండు విడతల్లో ప్రతిభకనబరచిన తొలి 2.5 లక్షల మందిని మాత్రమే అడ్వాన్స్‌డ్ రాసేందుకు అనుమతిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 రాత పరీక్ష ఈసారి మే 17న జరగనుంది. దేశంలోని 23 ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశానికి అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తారు. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతను ఐఐటీ రూర్కీ చేపట్టింది. ఈ మేరకు ఆ విద్యాసంస్థ డిసెంబరు 5న వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ఐఐటీల్లో ప్రస్తుతం 18,160 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారు బీఆర్క్ కోర్సుల్లో చేరాలనుకుంటే ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఐఐటీ రూర్కీ మరో కీలక అప్‌డేట్ జారీ చేసింది. ఈ పరీక్ష సిలబస్‌ను తాజాగా విడుదల చేసింది. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో పలు కాన్సెప్టులను కవర్ చేసేలా సిలబస్ రూపొందించారు. వీటితో పాటు అభ్యర్థులు ప్రాక్టీసు చేసేందుకు వీలుగా అడ్వాన్స్‌డ్ పరీక్షకు సంబంధించి 19 ఏళ్లకు సంబంధించి అంటే 2007 నుంచి 2025 వరకు ఉన్న పాత ప్రశ్నపత్రాలను సైతం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ మేరకు తన ప్రకటనలో పేర్కొంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








