Allen Scholarship 2026: విద్యార్ధులకు అలర్ట్.. మరోవారంలో అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్ 2026
ALLEN Scholarship Admission Test 2026: రాజస్థాన్‌లోని కోటా అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షల అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్ 2026-27 సంవత్సరానికి (ASAT) దేశ వ్యాప్తంగా పలు పరీక్ష..

కోటా, డిసెంబర్ 15: రాజస్థాన్‌లోని కోటా అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షల అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్ట్ 2026-27 సంవత్సరానికి (ASAT) దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో డిసెంబర్ 21వ తేదీన నిర్వహించనుంది. తదుపరి బ్యాచ్‌లకు ఈ ప్రవేశ పరీక్షను జనవరి 4న నిర్వహించనుంది. ఈ పరీక్షలో అభ్యర్ధుల ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ పరీక్షల కోసం అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
అలెన్ స్కాలర్‌షిప్ అడ్మిషన్ టెస్టు 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దేశంలోని అత్యంత ప్రసిద్ధ ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష తయారీ సంస్థలలో ఒకటైన అల్లెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్.. అత్యుత్తమ ఫలితాలతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తుంది. JEE అడ్వాన్స్‌డ్, JEE మెయిన్, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ NEET-UG ఫలితాల్లో ALLEN దేశంలోనే అత్యుత్తమంగా రాణిస్తుంది. IITలలో ప్రవేశం పొందే ప్రతి నాల్గవ విద్యార్థి ALLEN నుంచే రావడం విశేషం. గత రెండు సంవత్సరాలుగా ALLEN కెరీర్ ఇన్స్టిట్యూట్, కోట JEE అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్‌ను అందిస్తుంది. అలెన్ స్కాలర్‌షిప్ కు ఎంపికనై విద్యార్ధులకు ఈ సంస్థ అందించే కోర్సులకు 90 శాతం స్కాలర్‌షిప్ అందిస్తుంది.
సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మే 2026లో జరగబోయే సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మార్చి 3 నుంచి 16 వరకు అభ్యర్థులు ఐసీఏఐ సెల్ఫ్ సర్వీస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షల షెడ్యూల్ 2026 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








