CUET PG 2026 Exam: సీయూఈటీ పీజీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల.. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం
దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ 2026)నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. పీజీయూటీ టెస్ట్ ఆన్‌లైన్ దరఖాస్తులు..

హైదరాబాద్, డిసెంబర్ 15: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ 2026)నోటిఫికేషన్ తాజాగా విడుదలైంది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. పీజీయూటీ టెస్ట్ ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 14 నుంచి ప్రారంభమయ్యాయి. జనవరి 14, 2026వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. ఆన్‌లైన్ రాత పరీక్షలు దేశ వ్యాప్తంగా 276 ప్రధాన నగరాల్లో 2026 మార్చిలో జరగనున్నాయి. ఇందులో 16 నగరాలు భారత్‌కి వెలుపల ఉన్న దేశాల్లో నిర్వహించనున్నారు.
మొత్తం 157 సబ్జెక్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వీటిల్లో సెంట్రల్ యూనియవర్సిటీలతో పాటు కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తోన్న విద్యాసంస్థలు, రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యాసంస్థలు సైతం ఉన్నాయి. ఈ ఏడాది కూడా పీజీ సీయూఈటీ 2026 ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనుంది. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు ప్రారంభ తేదీ: డిసెంబర్ 14, 2025.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: జనవరి 14, 2026.
- పరీక్ష ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: జనవరి 14, 2026 రాత్రి 11.50 గంటల వరకు
- అప్లికేషన్ సవరణ తేదీలు: జనవరి 18 నుంచి 18 రాత్రి 11.50 గంటల వరకు
- సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్‌లోడ్ తేదీ: త్వరలో వెల్లడి
- అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ తేదీ: త్వరలో వెల్లడి
- రాత పరీక్షల తేదీ: మార్చి, 2026లో
సీయూఈటీ పీజీ 2026 ప్రవేశాల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








