Akhanda2 Viral Video: బాలయ్య తాండవం.. థియేటర్‌లో అఖండ 2 క్లైమాక్స్ చూస్తూ మహిళకు పూనకం! వీడియో వైరల్
బాలయ్య తాజా చిత్రం అఖండ 2 బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కుటుంబ కథా చిత్రం కావడంతో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అఖండ 2 మువీ చూస్తున్నంత సేపూ భక్తి, ఆధ్యాత్మికత వాతావరణంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇందులో బాలయ్య అఘోర అవతారంలో కనిపించే సన్నివేశాలు..

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా మువీ అఖండ 2. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ మువీ డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మించిన మువీ డే1 నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.59 కోట్లు వసూలు చేసిన బాలయ్య మువీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. కుటుంబ కథా చిత్రం కావడంతో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు. అఖండ 2 మువీ చూస్తున్నంత సేపూ భక్తి, ఆధ్యాత్మికత వాతావరణంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇందులో బాలయ్య అఘోర అవతారంలో కనిపించే సన్నివేశాలు, డైలాగులు, తమన్ అందించిన పవర్‌ఫుల్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా మారాయి. అఖండ 2పై పలు హిందూ సంఘాలు, స్వామీజీలు కూడా ప్రశంసలు కురిపించడం విశేషం.
ఇక థియేటర్లలో స్క్రీన్‌పై బాలయ్య కనిపించగానే అభిమానులు లేచి నిలబడి విజిల్స్, చప్పట్లతో హంగామా చేస్తున్నారు. క్లైమాక్స్ దగ్గరయ్యే కొద్దీ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే శివ స్తోత్రాలు ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నాయి. పూర్తిగా ఆధ్యాత్మిక లోకంలో విహరిస్తున్న అభిప్రాయం కలుగుతుంది. పిల్లలు, పెద్దలు అంతా ఈ మువీని ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో కొందరు అభిమానులు థియేటర్‌ల వద్ద ఏకంగా పూజలు, అభిషేకాలు కూడా చేస్తున్నారు. తాజాగా ఓ థియేటర్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ థియేటర్‌లో అఖండ మువీ చూస్తూ ఓ మహిళ పూనకంతో ఊగిపోయింది.
వీడియో ఇక్కడ చూడండి
A woman gets possessed and emotionally overwhelmed during the Shiva Tandava climax sequence in Akhanda 2.#Akhanda2 #NBK pic.twitter.com/tqLoW70fEP
— Milagro Movies (@MilagroMovies) December 14, 2025
మువీ క్రైమాక్స్‌లో శివుడు తాండవం ఆడే సీన్‌ను చూస్తూ ఆయనకు దండం పెడుతూ పూనకంతో ఊగిపోయింది. క్లైమాక్స్ సీన్‌లో పూర్తిగా లీనమైపోయిన సదరు మహిళ చేతులు ఊపుతూ, శరీరం కంపిస్తూ కనిపించింది. దీంతో పక్కనే ఉన్న ఆమె భర్త ఆమెను అదుపు చేసే ప్రయత్నం చేశాడు. దీంతో థియేటర్‌లోని ఇతర ప్రేక్షకులు ఆశ్చర్యంతో ఆమెను చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చకు దారి తీసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.








