AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్న నాన్న నాన్న.. నీ మనసెంత మంచిదో నాన్న..! భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ

బిగ్ బాస్ తెలుగు సీజన్ తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా ప్రారంభమై ఎన్నో ట్విస్టులతో సాగిన ఈ రియాలిటీ షోకు త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుంది. డిసెంబర్‌ 21న గ్రాండ్ ఫినాలే ఫైనల్‌ ఎపిసోడ్‌ జరగనుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. టాప్-5 కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేను ప్లాన్ చేశారు మేకర్స్.

నాన్న నాన్న నాన్న.. నీ మనసెంత మంచిదో నాన్న..! భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
Bigg Boss 9
Rajeev Rayala
|

Updated on: Dec 15, 2025 | 9:29 AM

Share

బిగ్ బాస్ సీజన్ మరో వారంలో ముగిసిపోనుంది. ప్రస్తుతం చివరి వారం బిగ్ బాస్ ఎపిసోడ్ మొదలైంది.. నిన్నటి ఎపిసోడ్ లో భరణి ఎలిమినేషన్ జరిగింది. దాంతో హౌస్ లో టాప్ 5 మిగిలారు. భరణి ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో ఐదుగురు మిగిలారు.. ఇమ్మాన్యుయేల్, తనూజ, డీమన్ పవన్, కళ్యాణ్, సంజన టాప్ 5లో ఉన్నారు. ఇక గతవారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ను ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి పంపించేశారు. శనివారం జరిగిన ఎపిసోడ్ లో సుమన్ శెట్టి హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అలాగే ఆదివారం భరణి ఎలిమినేట్ అయ్యాడు.

హౌస్ నుంచి భరణి ఎలిమినేట్ అవ్వడంతో తనూజ షాక్ అయ్యింది. హౌస్ లో నాన్న, నాన్న అంటూ భరణి చుట్టూ తిరిగిన తనూజ.. భరణి ఎలిమినేట్ అనగానే అతని కాళ్లమీద పడిపోయింది. ఇక ఇమ్మాన్యుయేల్ ఆనందంతో చప్పట్లు కొట్టాడు. నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించండి.. నేనూ టాప్ 5‌లో ఉండాలని కోరుకున్నాను. బట్ మీరు టాప్ 5కి అర్హులే. మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అని బయటకు వచ్చేశాడు. కాళ్లమీద పడ్డ తనుజను ఆశీర్వదించాడు భరణి.. మీరు అనుకున్నది సాధించే వస్తాను బయటకి. మీకు, మా నాన్నకి అదే చెప్తున్నా అని ఎమోషనల్ అయ్యింది తనూజ.

ఇక హౌస్ నుంచి స్టేజ్ పైకి వచ్చిన భరణికి తన జర్నీని చూపించారు నాగ్. ఆ జర్నీ వీడియోలో తనూజ, దివ్య, సుమన్ శెట్టి తప్ప ఎవ్వరూ లేరు. ఆతర్వాత ఒకొక్కరి గురించి చెప్పాడు భరణి. ఇమ్మానుయేల్ తో నాలుగు వారాలు బాగానే ఉన్నాను.. మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది కానీ.. అతనిపై నాకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పాడు భరణి, కళ్యాణ్ పడాల.. కప్ కొట్టే సామర్థ్యం ఉంది. ఆల్ ది బెస్ట్ అన్నాడు భరణి. సంజనా గారు కూడా.. ఫైటింగ్ స్పిరిట్ ఉంది కాబట్టే అక్కడున్నారు. డెమాన్ పవన్.. చాలా స్ట్రాంగ్. అతని డ్రీమ్స్ తీరాలని కోరుకుంటున్నా.. అని చెప్పుకొచ్చాడు భరణి. తనూజా నీ ఫ్యూచర్ బాగుండాలి. నీ పెళ్లికి నన్ను పిలు. తప్పకుండా వస్తాను. నువ్వు ట్రోఫీ ఎత్తాలి అని తెలిపాడు. ఇక ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే జరగబోతుంది. మరి ఎవరు విన్నర్ అవుతారో చూడాలి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా హార్మోన్లను సెట్ చేసుకోండి!
PCOD సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఇలా హార్మోన్లను సెట్ చేసుకోండి!
SRH vs KKR Live Score: తొలి గెలుపు కోసం ఎదురుచూపులు..
SRH vs KKR Live Score: తొలి గెలుపు కోసం ఎదురుచూపులు..
విమానం మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా? ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే..
విమానం మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా? ఒక్కసారి ట్యాంక్ ఫుల్ చేస్తే..
ఆ ప్లేయర్‌ను దింపేసిన కోహ్లీ.. వీడియో చూస్తే నవ్వాగదంతే..!
ఆ ప్లేయర్‌ను దింపేసిన కోహ్లీ.. వీడియో చూస్తే నవ్వాగదంతే..!
డబ్బు సంపాదించాలంటే కష్టపడటం ఆపండి.. ఎలాన్ మస్క్ 5 మనీ రూల్స్
డబ్బు సంపాదించాలంటే కష్టపడటం ఆపండి.. ఎలాన్ మస్క్ 5 మనీ రూల్స్
ప్రేక్షకుల గుండెలను కదిలిస్తున్న క్లైమాక్స్.. ఈ సినిమా చూశాారా..
ప్రేక్షకుల గుండెలను కదిలిస్తున్న క్లైమాక్స్.. ఈ సినిమా చూశాారా..
వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచన మేరకు ఊరంతా ఖాళీ!
వణికిస్తున్న వరుస మరణాలు.. పురోహితుడి సూచన మేరకు ఊరంతా ఖాళీ!
అలర్ట్‌..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
అలర్ట్‌..ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా?
మీ జీవితాన్ని మార్చే 5 జపనీస్ సూత్రాలు.. పాటిస్తే విజయం మీ సొంతం
మీ జీవితాన్ని మార్చే 5 జపనీస్ సూత్రాలు.. పాటిస్తే విజయం మీ సొంతం
ప్రతిరోజూ చెవులు శుభ్రం చేస్తున్నారా? మీరు ప్రమాదంలో పడ్డట్లే!
ప్రతిరోజూ చెవులు శుభ్రం చేస్తున్నారా? మీరు ప్రమాదంలో పడ్డట్లే!