అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్.. ఈ అమ్మడి గ్లామర్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లు గా రాణించి ఇప్పుడు హీరోయిన్స్ గా, హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతుంటే మరికొందరు వరుసగా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు నాగార్జునతో ఉన్న ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్టులగా చైల్డ్ యాక్టర్స్‌గా అదరగొట్టిన వారు ఇప్పుడు లీడ్ రోల్స్‌లో దుమ్ము రేపుతున్నారు. హీరోలుగా, హీరోయిన్స్ గా మరి సినిమాల్లో అదరగొడుతున్నారు. ముఖంగా హీరోయిన్స్.. చిన్నప్పటి క్యారెక్టర్స్ చేసిన వారే వీరు అని అంటే కొందరు నమ్మడం లేదు కూడా. ముఖ్యంగా అమ్మాయిలు అయితే బాల నటీమణులుగా మెప్పించిన 5, 6 సంవత్సారల్లోనే హీరోయిన్స్‌గా తెరంగేట్రం చేస్తున్నారు. అలా హీరో హీరోయిన్స్ అయిన బాల నటీమణులు తెలుగు చిత్ర సీమలో చాలామందే ఉన్నారు. సీనియర్ హీరో నాగార్జున హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ అయిన ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంలో నటించిన ఈ చిన్నది కూడా ఇప్పుడు హీరోయిన్ గా మారి అలరిస్తుంది. తన అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో కాదు.. క్రేజీ బ్యూటీ ప్రణవి మానుకొండ. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది ఈ చిన్నది. 2016లో విడులయిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సూపర్ కలెక్షన్స్‌తో అదరగొట్టింది. అప్పట్లో ఈ సినిమా వచ్చిన సమయంలోనే తారక్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ కూడా విడుదలైంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ రెండు సినిమాల్లో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా విజేతగా నిలిచింది. అప్పట్లో.. 50 కోట్ల పైగా షేర్ సాధించిన ఈ సినిమా.. నాగ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇకపోతే ఈ సినిమాలో చాలామంది ఫేసస్ యాక్టర్స్ నటించారు. పలువురు చైల్డ్ ఆర్టిస్ట్స్ సైతం సందడి చేశారు. వారిలో ప్రణవి కూడా ఒకరు. తన ఇప్పుడు కథానాయిక అయిపోయింది. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ కుమార్ హీరోగా ‘స్లం డాగ్ హస్బెండ్’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. అమ్మడు లేటెస్ట్ లుక్స్ చూసి నెటిజన్స్ షాకువుతున్నారు. ఈ అమ్మాయి ఏంట్రా బాబు ఇంత మారిపోయింది అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి…
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




