Tribal Education: ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని కొమరంబిం కాలనీలో నివసిస్తున్న గోండు విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు మార్గం సుగమం అయ్యింది. కనీస సౌకర్యాలు లేని ఈ ప్రాంతంలో, ఎండ, వాన, చలిని తట్టుకుంటూ సాగిన వారి చదువులకు కలెక్టర్ రాజర్షి షా చొరవతో ఏర్పాటు చేసిన రూ.5 లక్షల కంటైనర్ పాఠశాల పరిష్కారం చూపింది.