AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తనను వివస్త్రను చేసి కొట్టారని పోలీసులపై మహిళ ఆరోపణలు

తనను వివస్త్రను చేసి కొట్టారని పోలీసులపై మహిళ ఆరోపణలు

Phani CH
|

Updated on: Jan 07, 2026 | 6:36 PM

Share

కర్ణాటకలోని హుబ్లీలో సంచలన ఘటన చోటుచేసుకుంది. జనవరి 1న రాజకీయ కార్యకర్తల ఘర్షణ అనంతరం ఒక బీజేపీ మహిళా కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సులో తనను వివస్త్రను చేసి కొట్టారని ఆమె పోలీసులపై ఆరోపిస్తుండగా, మహిళే దుస్తులు విప్పిందని పోలీసులు ఎదురు ఆరోపిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని కూడా హుబ్లీ పోలీసులు పేర్కొన్నారు.

కర్ణాటకలోని హుబ్లీలో జనవరి 1న చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాళుక్య నగర్‌లో హోటళ్ల సర్వే సమయంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పాత కక్షల కారణంగా ఈ గొడవ మొదలైనట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానిక కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో ఒక బీజేపీ మహిళా కార్యకర్త కూడా ఉన్నారు. ఆమెను పోలీస్ బస్సులోకి తరలించారు. అయితే, బస్సులో తన దుస్తులు బలవంతంగా విప్పి, కొట్టారని సదరు మహిళా కార్యకర్త పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలను హుబ్లీ పోలీసులు ఖండించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏ క్షణాన ఏమవుతుందో ?? ఊపిరి బిగబట్టిన గ్రామస్థులు

హైకోర్టుకు రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు

ఓవైపు చలి.. మరోవైపు పొగమంచుతో ప్రజల ఇక్కట్లు

Gold Price: బంగారం ఇక కొనలేమా.. 24 క్యారెట్ల పసిడి ధర ఎంతంటే

ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!