Viral Video: BYD కార్ AI మామూలుది కాదు.. భర్తను పట్టించేందుకు అది ఏం చేసిందో చూడండి..
టెక్నాలజీ మన జీవితంలో ఎంతగా భాగమైపోయిందంటే, ఇప్పుడు కార్లే డిటెక్టివ్‌లుగా మారుతున్నాయి. చైనాలో జరిగిన ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక భార్య తన భర్త నడుపుతున్న 'BYD' కారులోని AI అసిస్టెంట్‌ను ఒక వింత ప్రశ్న అడిగింది. "నేను లేనప్పుడు నా భర్త ఈ కారులో వేరే ఎవరినైనా ఆడవారిని ఎక్కించుకున్నాడా?" అని అడిగిన ప్రశ్నకు ఆ కారు ఇచ్చిన సమాధానాలు విని నెటిజన్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఆ కారు నేరుగా సమాధానం చెప్పకపోయినా, భర్తను పట్టించేందుకు ఇచ్చిన 'టిప్స్' ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మీ కారు మీ భార్యకు మీ రహస్యాలన్నీ చెప్పేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి సీన్ ఒక డ్రైవింగ్ సమయంలో ఎదురైంది. BYD కారులోని ‘సియావో ఫాంగ్’ అనే AI అసిస్టెంట్ కేవలం రూట్ మ్యాప్ మాత్రమే కాదు, భర్త ప్రవర్తనను ఎలా గమనించాలో కూడా భార్యకు క్లాస్ పీకింది. భర్త నవ్వుతూ మేనేజ్ చేస్తున్నా, పక్కనే కూర్చున్న భార్య స్నాక్స్ తింటూ AI చెప్పే డిటెక్టివ్ పాఠాలను శ్రద్ధగా వినడం ఈ వీడియోలో హైలైట్. ఆ కారు ఇచ్చిన ఆసక్తికరమైన సూచనలేంటో ఈ కథనంలో చూద్దాం.
సాంకేతికత ఒక్కోసారి భలే వినోదాన్ని పంచుతుంది. చైనాకు చెందిన ఒక వీడియోలో, భార్య తన భర్త BYD కారులోని AI అసిస్టెంట్‌ను (Xiao Fang) ప్రశ్నించింది. ఆ కారు నేరుగా ‘అవును’ లేదా ‘కాదు’ అని చెప్పకుండా, ఒక డిటెక్టివ్‌లా కొన్ని టిప్స్ ఇచ్చింది:
AI ఇచ్చిన 3 క్రేజీ టిప్స్:
నావిగేషన్ హిస్టరీ చెక్ చేయండి: కారు ఎక్కడికి వెళ్లిందో హిస్టరీ చూస్తే అర్థమైపోతుందని, తెలియని లొకేషన్లు లేదా షాపింగ్ మాల్స్ కనిపిస్తే అనుమానించవచ్చని చెప్పింది.
కిలోమీటర్ల లెక్క: సాధారణం కంటే ఎక్కువ దూరం కారు తిరిగినా, ఆఫీసు పని కాకుండా అదనంగా డ్రైవింగ్ చేసినా భర్తను వివరణ అడగమని సూచించింది.
View this post on Instagram
కారు శుభ్రత: ఎప్పుడూ కారును పట్టించుకోని భర్త, అకస్మాత్తుగా కారును క్లీన్ చేయడం, లోపల మంచి సువాసన వచ్చేలా పర్‌ఫ్యూమ్స్, టిష్యూ పేపర్లు ఉంచడం వంటివి చేస్తే “సమస్య వచ్చే అవకాశం ఎక్కువ” అని విశ్లేషించింది.
సోషల్ మీడియా రియాక్షన్స్: ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఈ కారు భర్తను అడ్డంగా బుక్ చేస్తోంది” అని ఒకరు, “భర్త నవ్వుతున్నాడంటే అతను సేఫ్ అని అర్థం” అని మరొకరు కామెంట్ చేశారు. ఈ లోపు ఆ కారు చివరగా “ఏదైనా పక్కా ఆధారం దొరికే వరకు భర్తను అనుమానించకండి, ప్రశాంతంగా మాట్లాడండి” అని సలహా ఇచ్చి సీన్‌ను కూల్ చేసింది.
