ఇద్దరం కలిసి రచ్చ రచ్చ చేశాం.. మన శంకర వరప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెంకటేష్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై భారీగానే అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి నామస్మరణతో టాలీవుడ్ బాక్సాఫీస్ దద్దరిల్లుతోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఇప్పుడు ఒక సెన్సేషన్‌గా మారింది. నిన్న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కేవలం యూట్యూబ్ రికార్డులనే కాదు, సినీ అభిమానుల గుండెల్ని కూడా షేక్ చేస్తోంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో ‘మెగా’ మేనియా కనిపిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ఈ చిత్రం సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. సమకాలీన స్టార్ హీరోల ట్రైలర్ రికార్డులను అధిగమిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో బాస్ ముందే చూపిస్తున్నారు.
వింటేజ్ చిరంజీవి లుక్, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో రాబోతుంది మన శంకర వర ప్రసాద్ గారు. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో చిరంజీవి, వెంకటేష్ సందడి చేశారు. వెంకటేష్ మాట్లాడుతూ… చిరంజీవి గారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది.
ఇద్దరం కలిసి రచ్చ రచ్చ చేశాం.. నేను ఎప్పుడూ తమ్ముడు పవన్ కళ్యాణ్ తో చేశాను.. ఇప్పుడు అన్నయ్యతో చేస్తున్నాను. అనిల్ రావిపూడితో నా కంబోను సూపర్ హిట్ చేశారు. ఈసారి కూడా బిగ్ హిట్ చేయాలి. నయనతార తో కలిసి తులసి, లక్ష్మీ సినిమాలు చేశా.. ఆమె చాలా బాగా నటించింది. ఈ సినిమా మంచి ఫ్యామిలీ సినిమా.. సంక్రాంతికి రాబోతుంది. మీరు ఈ సినిమాను బిగ్ హిట్ చేయాలి. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను అందుకోవాలి. తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే అన్నీ సినిమాలూ ఆడాలి అని వెంకటేష్ అన్నారు.




