ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడి, నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది తమిళనాడు వైపు కదులుతుందని, అక్కడ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం ఉండదు.