మలబద్దకంతో ఇబ్బందా..? పెరుగు ఇలా తీసుకుంటే మీ పొట్ట హ్యాపీ
07 January 2026
TV9 Telugu
TV9 Telugu
నేటి జీవనశైలి కారణంగా అనేక మంది ఎదుర్కోంటున్న జీర్ణ సంబంధిత సమస్యల్లో మలబద్దకం ఒకటి. ఇది సాధారణ సమస్య అయినప్పటికీ దీనిని నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక జీర్ణ సమస్యలు వస్తాయట
TV9 Telugu
ఫైబర్ కలిగిన ఆహారాలను తక్కువగా తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది
TV9 Telugu
ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా మంది మందులు వాడుతుంటారు. అయితే మందులను వాడడానికి బదులుగా జీవనశైలిలో, ఆహార పద్దతుల్లో ఈ మార్పులు చేసకుంటే తేలికగా మలబద్దకం నుంచి బయటపడొచ్చు
TV9 Telugu
ముఖ్యంగా ఎండుద్రాక్షలను పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇది అత్యంత సులభమైన, సహజమైన మార్గం
TV9 Telugu
ఎండుద్రాక్ష పెరుగును తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో తాజా గోరు వెచ్చని పాలను తీసుకుని ఇందులో 4 లేదా 5 నల్ల ఎండుద్రాక్షలను వేయాలి
TV9 Telugu
ఆ తరువాత ఇందులో తోడుకు సరిపోయేలా ఓ పెరుగు చుక్క వేసి బాగా కలపాలి. తరువాత మూత పెట్టి రాత్రంతా వదిలేయాలి. ఇది మరుసటి రోజుకి పెరుగుగా మారుతుంది
TV9 Telugu
ఇలా తయారు చేసిన ఎండుద్రాక్ష పెరుగును భోజనంతో పాటు తీసుకోవచ్చు లేదంటే స్నాక్ గా కూడా తీసుకోవచ్చు. పిల్లలకు కూడా ఈ పెరుగును ఇవ్వవచ్చు
TV9 Telugu
ఎండుద్రాక్ష పెరుగు తీసుకోవడం వల్ల పొట్ట ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా పొట్టలో చెడు బ్యాక్టీరియా శాతం తగ్గి మంచి బ్యాక్టీరియా శాతం పెరుగుతుంది