AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాస్తు టిప్స్ : ఎలాంటి కారణం లేకుండానే ఇంటిలో గొడవలు అవుతున్నాయా?

ఇంటిలో గొడవలు అనేవి కామన్, కానీ కొందరి ఇంటిలో ఏ కారణం లేకుండానే కుటుంబ సభ్యుల మధ్య పదే పదే గొడవలు అవుతుంటాయి. అయితే ఇలా ఇంటిలో గొడవలు జరగడానికి ముఖ్య కారం వాస్తు అంటున్నారు పండితులు. అందుకే వాస్తు విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలంట. ఎవరు అయితే వాస్తు నియమాలు పాటిస్తూ ఉంటారో, వారి ఇంట ఎలాంటి కలహాలు, అనారోగ్య సమస్యలు ఉండవు.

Samatha J
|

Updated on: Jan 07, 2026 | 3:13 PM

Share
జ్యోతిష్యశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అందుకే వాస్తు శాస్త్ర నియమాలు తప్పకుండా పాటించాలి అంటారు. వాస్తు అనేది ఇంటి శ్రేయస్సును కాపాడి, కుటుంబ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. అంతే కాకుండా ఇది ఇంటిలో ఆనందకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. కానీ కొంత మంది ఇంటిలో పదే పదే గొడవలు అవుతుంటాయి. దీనికి ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ప్రధాన ద్వారం పరిశుభ్రంగా : ఇంటిలో ప్రధాన ద్వారం బాగున్నప్పుడే,  ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంటుంది. అందుకే తప్పకుండ ఇంటి ప్రధాన ద్వారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంట. ఇంటి ముందు చెప్పులు, బూట్లు చెల్లా చెదురుగా లేకుండా చూసుకోవాలి. అలాగే ఇంటికి ఎదురుగా బరువైన ఫర్నీచర్ ఉండకూడదు. ఇది ఇంటిలో కలహాలకు కారణం అవుతుందంట.

2 / 5
 వంటగది : కొంత మంది వంటగదిలో విరిగిన, పాడైన సమాను ఉంచుతారు. అదే విధంగా వంట గది ఎప్పుడూ చిందరవందరగా ఉంచుకుంటారు. కానీ వంటగది శుభ్రంగా ఉన్నప్పుడే ఇంటిలో సానుకూల వాతావరణం ఉంటుందంట. లేకపోతే ఇది ఇంటిలో సమస్యలను తీసుకొస్తుంది.

3 / 5
ఇంటికి వెలుగు : కొంత మంది ఇంటికి సరైన వెలుగు ఉండదు, వెంటిలేషన్ సరిగ్గా ఉండదు. కానీ ఏ ఇంటికి అయితే సరైన వెలుగు ఉంటుందో, ఆ ఇంటిలో ఆనందకర వాతావరణం ఉంటుందంట. అందుకే తప్పకుండా ఇంటిలోకి మంచి వెలుగు వచ్చేలా చూసుకోవాలి. కిటికీలు, తలుపులు తెరిచి పెట్టాలి.

4 / 5
అలాగే ఇంటికి గజిబిజీగా ఉండే రంగులు కాకుండా, ప్రశాంతతను ఇచ్చే రంగులు వేయించాలి. అదే విధంగా,  ఇంటి ముందు పచ్చని చెట్లు, తులసి చెట్టు ఉండాలి. అంతే కాకుండా ఎప్పుడు కూడా ఇంటిలో విరిగిన, పాడైన వస్తువులు ఉంచడం మంచిది కాదు, అందువలన అలాంటివి ఇంటిలో ఉండకుండా చూసుకోవాలి.

5 / 5