కూరల్లో వేసే చిటికెడు పసుడు కాస్త ఎక్కువైతే.. మీ కిడ్నీలు షెడ్డుకే!

07 January 2026

TV9 Telugu

TV9 Telugu

ప్రతి ఇంటి వంట గదిలో పసుపు ఖచ్చితంగా ఉంటుంది. కూరల్లో వేసే చిటికెడు పసుపు రుచిని పెంచడమే కాదు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది

TV9 Telugu

అయితే ఆరోగ్యకరం అని ఏదైనా అతిగా తీసుకుంటే అనర్థాలకు దారితీస్తుంది. ఇది పసుపు విషయంలోనూ వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

పసుపును మోతాదుకు మించి వాడడం వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందట. పసుపు సరైన మోతాదులో తీసుకుంటే పైత్య రసం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణాశయంలో ఆమ్లాల ఉత్పత్తిని పెంచి జీర్ణమవడంలో సహకరిస్తుంది

TV9 Telugu

అదే పసుపు మోతాదు పెరిగితే పైత్య రసం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఆమ్లాల మోతాదు కూడా పెరుగుతుంది. ఇది జీర్ణాశయంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది

TV9 Telugu

అందుకే గ్యాస్ట్రిక్‌ సమస్యలున్న వారు ఆచితూచి తీసుకోవాలి. అలాగే కూరల్లో మోతాదుకు మించి పసుపు వాడితే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలూ లేకపోలేదు

TV9 Telugu

పసుపులో ఉండే కర్క్యుమిన్‌ అనే సమ్మేళనం ఆహారంలోని ఐరన్‌ను శరీరం గ్రహించేందుకు సహకరిస్తుంది.  అదే ఎక్కువైతే సీన్‌ రివర్స్‌ అయ్యి రక్తహీనతకు దారి తీస్తుంది

TV9 Telugu

పసుపులో ఉండే కర్క్యుమిన్‌ పెరిగితే కొంతమందిలో తలనొప్పి కూడా వస్తుంది. అలాగే  విరేచనాలు, మలబద్ధకం, కడుపుబ్బరం, అజీర్తి, వికారం, వాంతులు.. వంటి సమస్యలూ రావచ్చు

TV9 Telugu

పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. ఈ ఫలితాలన్నీ పొందాలంటే పసుపును తగిన మోతాదులోనే తీసుకోవాలి