అప్పుల బాధ నుంచి అపర కుబేరుల వరకు.. ఈ ఐదింటి పవర్ తెలిస్తే అస్సలు వదలరు
venkata chari
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కి, సంపద, శ్రేయస్సును ఆకర్షించాలని చాలా మంది కోరుకుంటారు. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
ఆర్థిక ఇబ్బందులకు చెక్
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని రకాల రత్నాలు (Gemstones) మన జీవితంలో సానుకూల శక్తిని నింపి, లక్ష్మీ కటాక్షం కలిగేలా చేస్తాయని నమ్ముతారు.
రత్నాలతో లక్ష్మీ కటాక్షం
సంపదను అయస్కాంతంలా ఆకర్షించే 5 శక్తివంతమైన రత్నాలు ఉన్నాయని మీకు తెలుసా. వీటిని ధరిస్తే జీవితంలో కీలక మార్పులు చూడొచ్చని చెబుతున్నారు.
లక్ మారాల్సిందే
పచ్చను బుధ గ్రహానికి ప్రతిరూపంగా భావిస్తారు. ఇది వ్యాపారంలో విజయాన్ని, విజ్ఞానాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు దీనిని ధరించడం వల్ల కొత్త అవకాశాలు తలుపు తడతాయని నమ్మకం.
1. పచ్చ (Emerald)
గురు గ్రహం (బృహస్పతి) అనుగ్రహం కోసం పుష్యరాగాన్ని ధరిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇది అన్ని రత్నాలలో అత్యంత శుభప్రదమైనది. ఇది కేవలం సంపదనే కాకుండా, సమాజంలో గౌరవ మర్యాదలను, అదృష్టాన్ని కూడా పెంచుతుంది.
2. కనక పుష్యరాగం (Yellow Sapphire):
దీనిని 'మనీ స్టోన్' లేదా 'సక్సెస్ స్టోన్' అని పిలుస్తారు. ఇది పసుపు రంగులో ఉండి చూడటానికి పుష్యరాగంలాగే ఉంటుంది. వ్యాపారంలో నష్టాలను తగ్గించి, లాభాల బాట పట్టించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇంటి గల్లా పెట్టెలో లేదా పర్సులో దీనిని ఉంచుకోవడం వల్ల డబ్బు నిలబడుతుందని నమ్ముతారు.
3. సిట్రిన్ (Citrine - సునైలా)
జేడ్ రత్నం మనసును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా, మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇది వ్యక్తికి ఏకాగ్రతను ఇచ్చి, సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. చైనీస్ వాస్తు శాస్త్రంలో కూడా దీనికి గొప్ప ప్రాముఖ్యత ఉంది.
4. జేడ్ (Jade)
చూడటానికి బంగారంలా మెరిసే ఈ రత్నం, సంపదను ఆకర్షించడంలో చాలా వేగంగా పనిచేస్తుందని నమ్ముతారు. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచి, ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. దీనిని కార్యాలయంలో డెస్క్ మీద ఉంచుకోవడం వల్ల కెరీర్‌లో పురోగతి లభిస్తుంది.
5. పైరైట్ (Pyrite)
రత్నాలను ధరించే ముందు తప్పనిసరిగా అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుడిని సంప్రదించి, మీ జాతకానికి అవి సరిపోతాయో లేదో తెలుసుకోవాలి. సరైన రత్నాన్ని, సరైన పద్ధతిలో ధరించినప్పుడే ఆశించిన ఫలితాలు అందుతాయి.