Watch Video: శ్రీశైలం రోడ్లపై యువతి రీల్స్.. తిక్క కుదిర్చిన భక్తులు
శక్తిపీఠము, జ్యోతిర్లింగము ఒకేచోట కొలువై ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత కలిగిన శ్రీశైల మహా క్షేత్రాన్ని కూడా రీల్స్ జబ్బు వదలడం లేదు. శ్రీశైలంలో రీల్స్ చేస్తే వ్యూస్ ఎక్కువగా వస్తాయని, సొసైటీలో గుర్తింపు వస్తుందనే చెడు ఆలోచన కొందరిని కష్టాలపాలు చేస్తోంది. తాజాగా అలాంటి ఘటన వెలుగు చూసింది.

ఈ మధ్య కాలంలో యువతలో రీల్స్ పిచ్చి మరీ పెరిగిపోతుంది. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తామనేది కూడా తెలియకుండా పోంతుంది. సోషల్ మీడియాలో ఫేమ్ కోసం ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేసి కొందరు జైలుకెళ్తుంటే, మరికొందరు విమర్శపాలవుతున్నారు. అయినా కూడా అలాంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఇలానే ప్రముఖ శైశక్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలో భక్తుల మనోభావాలకు భంగం కలిగించేలా ఓ యువతీ నృత్యాలు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. యువతి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిత్య క్యూట్ బేబీ పేరుతో ఉన్న ఇన్‌స్ట్రాగ్రామ్ హ్యాండిల్లో పోస్ట్ చేయబడి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శ్రీశైల మహా క్షేత్రంలో ఓం నమశ్శివాయ హర హర శంభో శంకర.. లాంటి భక్తి బావ పదాలు తప్ప మిగిలిన వాటికి నిషేధం ఉంది. కానీ ఈ నిబంధనలను లెక్కచేయకుండా నిషేధిత పదాలతో కూడిన పాటలకు ఓ యువతి శ్రీశైలం ప్రధాన రహదారిపై అందరూ చూస్తుండగానే ఫోక్ డాన్స్ చేసింది.
ఇది చూసిన భక్తులు, జనాలు ఆశ్చర్యపోయారు. ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇలాంటి నృత్యాలు, పాటలు నిషేధమని, వాటికి దూరంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేస్తున్నారు భక్తులు. ఇలాంటి రీల్స్ చేసిన వారిపై చేస్తున్న వారిపై దేవస్థానం అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
