AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: హంతకుడిని పట్టించిన సూపర్ డాగ్ సోను.. క్రైం స్టోరీని మించిన సీన్..

కడప నగర పరిధిలోని స్వరాజ్ నగర్‌లో ఈ నెల 11వ తేదీన ఒక ఆన్ఐడెంటిఫైడ్ బాడీ.. రిమ్స్ ఆసుపత్రి పరిధిలోని చెరువులో కనబడింది. అయితే అది హత్యా..? లేక ఆత్మహత్యా..? అసలు ఆ వ్యక్తి ఇక్కడ వ్యక్తేనా అనే అనుమానాలతో పోలీసులు ఈ కేసును నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు..

Andhra: హంతకుడిని పట్టించిన సూపర్ డాగ్ సోను.. క్రైం స్టోరీని మించిన సీన్..
Sonu Dog
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Dec 18, 2025 | 3:22 PM

Share

టెక్నాలజీ రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్న ఈ రోజులలో పోలీసులు వద్ద ఉన్న జాగిలాలు తమ వంతు పోలీసులకు సాయం చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మందుగుండు సామాగ్రిని, బాంబులను డిటెక్ట్ చేయడంలో ఎంతో ఉపయోగపడే ఈ పోలీస్ డాగ్స్ దొంగలను, హంతకులను పట్టించడంలో కూడా తమ వంతు కృషి చేస్తున్నాయి. కడపలో జరిగిన ఓ హత్య కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఈ సూపర్ డాగ్ సోని తన చాకచక్యంతో నిందితుడిని పట్టించింది. వివరాల ప్రకారం.. కడప నగర పరిధిలోని స్వరాజ్ నగర్‌లో ఈ నెల 11వ తేదీన ఒక ఆన్ఐడెంటిఫైడ్ బాడీ.. రిమ్స్ ఆసుపత్రి పరిధిలోని చెరువులో కనబడింది. అయితే అది హత్యా..? లేక ఆత్మహత్యా..? అసలు ఆ వ్యక్తి ఇక్కడ వ్యక్తేనా అనే అనుమానాలతో పోలీసులు ఈ కేసును నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.. అయితే ఈ కేసులో పోలీసుల కన్నా పోలీస్ జాగిలం సోను సూపర్ ఫాస్ట్ గా పనిచేసింది. రిమ్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా పోలీసులు చెరువులో దొరికిన డెడ్ బాడీని కేసును చేధించే క్రమంలో పోలీసు జాగిలం హత్య చేసిన నిందితులను కనిపెట్టింది. చివరకు జాగిలం నిందితుడిని పట్టించింది.

డబ్బుల విషయంలో వెంకటయ్య, అరుణ్ అనే వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. బైక్ ను కొదవ పెట్టి వెంకటయ్యకు అరుణ్ డబ్బులు అప్పుగా ఇచ్చాడు. అయితే ఆ డబ్బులను తిరిగి చెల్లించడంలో వెంకటయ్య కొంత ఇబ్బంది పడ్డాడు.. దీంతో అరుణ్ అతనిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే.. వెంకటయ్యతో అరుణ్ స్నేహపూర్వకంగా మెలుగుతూ మద్యం సేవించి సిమెంట్ దిమ్మతో మోది హత్య చేశాడు.

అయితే.. హత్య చేస్తుండగా మైనర్ బాలుడు.. ఆ దృశ్యాలను చిత్రీకరించాడు.. కానీ ఆ ఆధారాలేవి బయటకు రాలేదు. అయితే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు పోలీసుల వద్ద లేవు.. కానీ పోలీసు జాగిలం సోను ఈ హత్యను చేధించింది. పోలీస్ జాగిలం సోను హత్య కేసును చేధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..