AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ సితారయ్యింది

అల్వాల్ ఎస్సై రాఘవేందర్ రెడ్డి విచారణలో మురహరి గౌడ్‌కు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ లేకుండా ఇల్లీగల్‌గా క్లినిక్ నడుపుతున్నట్టు గుర్తించారు. ఏప్రిల్‌లోనే మెడికల్ కౌన్సిల్ ఈ విషయంపై కేసు నమోదు చేసినట్టు వెల్లడైంది. ఇదే ఆసరా చేసుకుని ఎస్సై 10 లక్షలు డిమాండ్ చేశాడని మురహరి కుటుంబం ఆరోపిస్తోంది.

Hyderabad: కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ సితారయ్యింది
Rmp Doctor
Sravan Kumar B
| Edited By: |

Updated on: Dec 18, 2025 | 11:27 AM

Share

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్ఎంపీ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై వేధింపులు, లంచం డిమాండ్‌లే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటన వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా వాసి ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిశీలనలో ‘గౌరవి’ క్లినిక్ నడుపుతున్న ఆర్ఎంపీ మురహరి గౌడ్ ఓ రోగి చావుకు దారితీసినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. డిసెంబర్ 7న కడుపు నొప్పితో వచ్చిన వేల్పుల సంగయ్యకు ఇంజక్షన్లు, సిరప్ ఇచ్చిన ఆర్ఎంపీ మురహరి కొద్దిసేపటికే పేషెంట్ సంగయ్యకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పడంతో కుటుంబ సభ్యుల సహాయంతో మెరుగైన చికిత్స కోసం దగ్గర్లోని ఎక్స్కాల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ రోగి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మురహరి నిర్లక్ష్యాన్ని ఆరోపించి 8న అల్వాల్ పోలీస్‌లో ఫిర్యాదు చేశారు.

అల్వాల్ ఎస్సై రాఘవేందర్ రెడ్డి విచారణలో మురహరి గౌడ్‌కు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్ లేకుండా ఇల్లీగల్‌గా క్లినిక్ నడుపుతున్నట్టు గుర్తించారు. ఏప్రిల్‌లోనే మెడికల్ కౌన్సిల్ ఈ విషయంపై కేసు నమోదు చేసినట్టు వెల్లడైంది. ఇదే ఆసరా చేసుకుని ఎస్సై 10 లక్షలు డిమాండ్ చేశాడని మురహరి కుటుంబం ఆరోపిస్తోంది. కేసు నమోదు చేయడానికి డబ్బులు ఇస్తే కేసులో అరెస్టు కాకుండా చూస్తానని హామీ ఇచ్చి, చివరికి 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 1.50 లక్షలు ఇచ్చినా మిగిలిన డబ్బుల కోసం వేధింపులు పెరిగి మురహరి మానసికంగా కుంగిపోయి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు చెబుతున్నారు. ఎస్సై వేధింపులే ఆత్మహత్యకు కారణమని న్యాయం చేయాలని మురహరి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సమాచారం. మృతుడిపై గతంలోనే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇల్లీగల్‌గా క్లినిక్ నడుపుతున్నందున కేసులు బుక్ చేసిందని ఆ ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకునే ఉండొచ్చని అంటున్నారు. లంచం డిమాండ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదనేది పోలీసుల వెర్షన్. తెలంగాణలో ఆర్ఎంపీ‌లు అనేక చోట్ల లైసెన్స్ లేకుండా నడుపుతున్నారు. మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదులు, రోగుల మరణాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు, అధికారుల మధ్య అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. ఈ ఘటన పోలీసు వ్యవస్థలో అవినీతి, ఆర్ఎంపీ క్లినిక్‌ల నియంత్రణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..